టీమిండియా ప్రపంచ రికార్డ్‌ను బ్రేక్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆసీస్‌కు ఇచ్చిపడేసిందిగా..

South Africa vs West Indies: టెస్టు క్రికెట్‌లో ఒకే జట్టుపై వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది. 2002 నుంచి ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియా ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదు. అంటే గత 22 ఏళ్లలో వెస్టిండీస్‌పై టీమిండియా వరుసగా 9 సిరీస్‌లను కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచ రికార్డు సృష్టించింది.

Venkata Chari

|

Updated on: Aug 18, 2024 | 4:15 PM

గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన 2వ టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 2 మ్యాచ్‌ల సిరీస్‌ని 1-0తో కైవసం చేసుకుంది. అంతకుముందు తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

1 / 5
ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టడం విశేషం.

2 / 5
అంటే, టెస్టు క్రికెట్‌లో ఒకే జట్టుపై వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది. 2002 నుంచి ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియా ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదు. అంటే గత 22 ఏళ్లలో వెస్టిండీస్‌పై టీమిండియా వరుసగా 9 సిరీస్‌లను కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచ రికార్డు సృష్టించింది.

3 / 5
వెస్టిండీస్‌పై వరుస సిరీస్‌లను గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా కూడా టీమిండియా ప్రపంచ రికార్డును సమం చేసింది. 2000 నుంచి వెస్టిండీస్‌పై ఆసీస్ వరుసగా 9 టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది.

4 / 5
ఇప్పుడు టీమిండియా, ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడంలో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. 1998 తర్వాత దక్షిణాఫ్రికా 10వ సారి సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్‌లో ఒకే జట్టుపై వరుసగా 10 సిరీస్‌ల ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

5 / 5
Follow us