అయితే, ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 15 రోజుల ముందు ఐపీఎల్ ఫైనల్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. అంటే ఐపీఎల్ ఫైనల్, డబ్ల్యూటీసీ ఫైనల్ మధ్య 15 రోజుల గ్యాప్ ఉంటుంది. ఈ రెండు వారాల్లో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సిద్ధమవుతుంది. దీని ద్వారా తొలిసారి డబ్ల్యూటీసీకి పట్టం కట్టేందుకు బీసీసీఐ ప్లాన్ వేసింది.