- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: I Would like to play for RCB says kkr player Rinku Singh
IPL 2025: బెంగళూరు తరపున ఆడేందుకు సిద్ధమైన సిక్సర్ కింగ్.. కోల్‌కతాకు హ్యాండిస్తాడా?
Rinku Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రింకూ సింగ్ జీతం రూ. 55 లక్షలు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఈసారి అతడిని భారీ మొత్తానికి అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. లేదంటే ఐపీఎల్ మెగా వేలంలో రింకూ సింగ్ కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ వేలంలోకి దిగితే రింకూను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ ముందుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Updated on: Aug 19, 2024 | 3:52 PM

IPL 2025 మెగా వేలం కోసం రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. ఈ మార్గదర్శకాల తయారీ తర్వాత, అన్ని ఫ్రాంచైజీలు చాలా మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే పనిలో పడ్డాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ వేలానికి ముందు అన్ని జట్లూ 4+2 ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

అంటే, మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంచైజీ నేరుగా నలుగురిని రిటైన్ చేసుకోవచ్చు. మరో ఇద్దరు ఆటగాళ్లను ఆర్టీఎం కార్డులను ఉపయోగించి వేలానికి విడుదల చేసేందుకు అనుమతించనున్నట్లు సమాచారం. దీని ప్రకారం, మెగా వేలానికి ముందు ప్రతి జట్టు నుంచి 19 మంది ఆటగాళ్లు తప్పుకోవడం ఖాయం.

అందుకే, ఈసారి రింకూ సింగ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోతే ఏ జట్టు తరపున ఆడతాడని అడిగారు. ఈ ఆసక్తికర ప్రశ్నకు కేకేఆర్ ఖతర్నాక్ ప్లేయర్ సూటిగా సమాధానమిచ్చాడు.

'అవును, KKR నన్ను రిటైన్ చేయకపోతే, నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడటానికి ఎదురు చూస్తున్నాను. నేను ఆర్‌సీబీ తరపున ఆడాలనుకుంటున్నాను' అంటూ స్పోర్ట్స్ టాక్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ తేల్చిపారేశాడు. దీని ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్‌లో చేరాలని తన కోరికను వ్యక్తం చేశాడు.

అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచిన రింకూ సింగ్‌ను కేకేఆర్ వదులుతుందా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే రింకూ సింగ్ 2018 నుంచి కేకేఆర్ తరపున ఆడుతున్నాడు. గత వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా అతడ్ని అట్టిపెట్టుకుంది. అందువల్ల ఈసారి కూడా అతడిని జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.

అయితే, రింకూ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తప్పుకుంటే, ఇతర ఫ్రాంచైజీలు అతనిని కొనుగోలు చేయడంలో తీవ్రమైన పోటీ పడతాయనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే అంతకుముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలనే కోరికను రింకూ సింగ్ వెల్లడించారు. అందుకే ఈసారి వేలంలో రింకూ కనిపిస్తే అతడి కొనుగోలుకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ గట్టి పోటీనిస్తుందని అంచనా.




