- Telugu News Photo Gallery Kitchen Hacks: Cooker Rubber is Getting Loose, Follow These Tips and Tricks to Make it Tighter, Know Here Details
Kitchen Hacks: కుక్కర్ రబ్బర్ పదే పదే వదులుగా మారుతుందా? ఈ చిట్కాలు పాటిస్తే ఎప్పటికీ టైట్‌గా ఉంటుంది..
Tips for Repairing a Pressure Cooker’s Loose Rubber: చాలా మంది తమ వంటగదిలో త్వరగా ఉడికించడానికి ఓవెన్‌కు బదులుగా ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించడాన్ని ఇష్టపడతారు. ప్రెజర్ కుక్కర్‌లోని ఆహారం త్వరగా ఉడకడమే కాకుండా.. రుచికరంగానూ ఉంటుంది. అయితే, కుక్కర్ అక్వేరియంలో ఉన్నందున అందులోని రబ్బరు (గ్యాస్కెట్) త్వరగా వదులుగా మారుతుంది. ఫలితంగా కుక్కర్‌లో ప్రెజర్ తగ్గుతుంది. దాంతో వంట ఆలస్యం అవుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారా? అయితే, ఈ టిప్స్ మీకోసమే. వీటిని ఫాలో అయితే, కుక్కర్ రబ్బర్ ఎప్పటికీ వదులు అవదు.
Updated on: Aug 27, 2023 | 7:42 PM

కుక్కర్‌ను ఎక్కువగా వినియోగించడం వలన అందులోని రబ్బర్(గ్యాస్కెట్) వదులుగా మారుతుంది. ఫలితంగా వంట చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అయితే, రబ్బు వదులు కాకుండా ఉండటానికి దానిని చల్లని నీటితోనే కడగాలి. ముందుగా దానిని మూత నుంచి తీసేయాలి. ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల రబ్బరు కాస్త సంకోచం చెంది దగ్గరకు అవుతుంది. కుక్కర్‌లో ప్రెజర్ పనిచేస్తుంది.

కుక్కర్‌లో వండటం వలన అందులోని రబ్బర్ అధిక వేడికి గురై.. అది కాస్త వదులుగా మారుతుంది. అలాంటి సందర్భంలో దానిని చల్లార్చిన అవసరం ఉంది. చల్లని నీటితో కడగడం గానీ, చల్లని ప్రదేశంలో ఉంచడం గానీ చేయాలి.

కొన్నిసార్లు కుక్కర్ రబ్బర్ చాలా వదులుగా మారుతుంది. అది మూత నుంచి బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితిలో దానిని పడేసే బదులు.. మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటే ఓ 10 నిమిషాలు అందులో ఉంచాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూతపై మళ్లీ రబ్బర్‌ను పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టడం వలన రబ్బర్ గట్టి పడుతుంది. ఫలితంగా మళ్లీ అతి కొత్త రబ్బర్ మాదిరిగా పని చేస్తుంది.

మీ కుక్కర్ రబ్బర్ వదులుగా ఉంటే పిండిని ఉపయోగించొచ్చు. కొంత పిండిని ముద్దగా చేసుకుని, కుక్కర్ మూత చుట్టూ అతికించాలి. తద్వారా ప్రెజర్ ఎక్కకువగా ఉంటుంది. అయితే, ఈ పరిష్కారం తాత్కాలికంగా మాత్రమే ఉపకరిస్తుంది.