AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డు రుణం చెల్లించకపోతే రైతుల భూమిని వేలం వేస్తారా..? బ్యాంక్ రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల వరకు రుణం సదుపాయం కల్పిస్తోంది. కేవలం తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణం అందిస్తోంది. అయితే ఈ రుణం తీసుకున్నవారు చెల్లింకచకపోతే రైతుల భూమిని బ్యాంకులు వేలం వేస్తాయా? అనేది చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Apr 22, 2026 | 6:08 PM

Share
దేశంలోని అన్నదాతలకు రుణ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అతి తక్కువ వడ్డీకే రైతులకు బ్యాంక్ రుణాలు అందిస్తోంది. తమకు ఉన్న వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి రూ.3 లక్షల వరకు రైతులు తమ సమీపంలోని బ్యాంకుల నుంచి లోన్ పొందవచ్చు. రైతులకు అవసరం ఉన్నప్పుడు ఈ లోన్ తీసుకోవచ్చు. తక్కువ వడ్డీకి రుణ సదుపాయం లభిస్తుండటంతో చాలామంది రైతులు తీసుకుంటున్నారు.

1 / 5
అయితే కేసీసీ కింద తీసుకున్న లోన్ సకాలంలో చెల్లించకపోతే భూమిని బ్యాంక్ వేలం వేస్తుందా..? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. దీనిపై రైతుల్లో అనేక అపోహలు ఉన్నాయి. అయితే ఈ రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు తక్షణమే ఎలాంటి చర్య తీసుకోవు. బ్యాంకులు తొలుత రిమైండర్లు, నోటీసులు పంపుతుంది. ఆ తర్వాత 90 రోజుల్లోగా కట్టకపోతే అకౌంట్‌ను నిరర్దక ఆస్తిగా ప్రకటిస్తారు.

2 / 5
ఆ తర్వాత బ్యాంక్ రుణాన్ని తిరిగి వసూలు చేసే ప్రక్రియను మొదలుపెడుతుంది. మొదట రాజీకి ప్రయత్నాలు చేస్తారు. అయినా పరష్కారం దొరక్కపోతే బ్యాంకులు ఎమ్మార్వో స్థాయిలో ప్రయత్నాలు చేస్తాయి. రెవెన్యూ బకాయిలుగా పరిగణించి వసూలు చేసే ప్రాసెస్ చేపతారు. చివరికి కట్టకపోతే భూమిని జప్తు చేయడం, వేలం నిర్వహించి విక్రయించడం లాంటివి చేస్తారు. వేలానికి ముందు రైతులకు బహిరంగ ప్రకటన రూపంలో చివరి అవకాశం కల్పిస్తారు.

3 / 5
వేలం నుంచి వచ్చిన సొమ్ములో బ్యాంక్ తన బకాయిలను తీసుకుని మిగతా సొమ్మును రైతులకు తిరిగి ఇస్తుంది. అయినా కొన్ని అనివార్య పరిస్థితుల్లో బ్యాంకులు రైతుల భూమిని వేలం వేయవు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, ప్రభుత్వం రుణమాఫీ చేయడం, బీమా క్లెయిమ్స్ వంటి పరిస్థితుల్లో భూమిని జప్తు చేయడం లేదా వేలం పాట నిర్వహించడం లాంటివి ఉండవు. రైతుల రుణాల విషయంలో బ్యాంకులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవు.

4 / 5
అయితే బ్యాంకులు నిబంధనలను పాటించకపోతే రైతులు కోర్టుకు లేదా డీఆర్‌టీకి అప్పీల్ చేసే అవకాశముంది. లేకపోతే రైతులు లోన్ సెటిల్మెంట్ చేసుకోవడం, రుణాన్ని రెన్యూవల్ చేసుకోవడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. కేవలం చివరి ప్రయత్నంలో మాత్రమే బ్యాంకులు భూమిని వేలం వేస్తాయి. అదే మొదటి అడుగుగా ఉండదు.  దీంతో రైతులు టెన్షన్ పడాల్సలిన అవసరం ఉండదు.

5 / 5
Follow Us
కేసీసీ రుణం చెల్లించకపోతే రైతుల భూమిని జప్తు చేస్తారా..?

ఇదొక్కటి కలిపితే వారమైనా పెరుగును ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

పిల్లలను డిజిటల్ అడిక్షన్‌ నుంచి కాపాడుకోవడం ఎలా?

బొప్పాయి ఆకులతో నేచురల్ పెస్టిసైడ్! ఖర్చు లేకుండా పంటలకు రక్ష!

అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు.. ఎక్కడ

ఇవి రెండు ఆకులు నమిలితే షుగర్ జీవితంలో రాదు.! ఇక మందులతో పనుండదు

భారత్ నుండి అమెరికాకు నడక దారి!రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు

ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు!

రూ.15వేలలోపు చెల్లింపులు చేస్తున్నారా..? ఆర్బీఐ ఊరట..