AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకు రీల్స్ చూసే అలవాటు ఉందా? ఈ మ్యాటర్ తెలిస్తే గుండెల్లో దడే..

టెక్నాలజీ అనేది అభివృద్ధికి తోడ్పడాలి కానీ అలవాటుగా మారకూడదు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారికి డిజిటల్ పరికరాల కంటే మైదానాల్లో ఆటలు, పుస్తకాలతో స్నేహాన్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. స్క్రీన్ టైమ్ సమస్య తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎదురవుతోందని కామత్ వివరించారు. తన కుమారుడు కియాన్ చదువుతున్న స్కూల్లో డిజిటల్ పరికరాలకు అనుమతి లేదని, ఇంట్లో కూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే స్క్రీన్ టైమ్ ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ, పిల్లలు షార్ట్ వీడియోలు, రీల్స్‌కు ఎంత త్వరగా ఆకర్షితులవుతున్నారో చూసి తాను ఆశ్చర్యపోతున్నానని వెల్లడించారు.

పిల్లలకు రీల్స్ చూసే అలవాటు ఉందా? ఈ మ్యాటర్ తెలిస్తే గుండెల్లో దడే..
Screen Time For Kids.jpg
Nikhil
|

Updated on: Apr 22, 2026 | 6:48 PM

Share

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ఒక అవసరంగా మారింది. అయితే, అదే స్మార్ట్‌ఫోన్ చిన్నారుల పాలిట శాపంగా మారుతోందని జెరోధా కో-ఫౌండర్, బిలియనీర్ నితిన్ కామత్ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ప్రవర్తన మరియు వారి మెదడు ఎదుగుదలపై అధిక ‘స్క్రీన్ టైమ్’ చూపుతున్న ప్రతికూల ప్రభావాల గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పనుల ఒత్తిడిలో పిల్లలను శాంతింపజేయడానికి లేదా వారిని ఒక చోట కూర్చోబెట్టడానికి డిజిటల్ పరికరాలను ఒక ‘పసిఫైయర్’ (నోట్లో పెట్టే చుప్ప) లాగా వాడుతున్నారని, ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరమైన బానిసత్వానికి దారితీస్తుందని అన్నారు.

తగ్గుతున్న సామర్థ్యం

నితిన్ కామత్ తన పోస్ట్‌తో పాటు కాగ్నిటివ్ న్యూరో సైంటిస్ట్ జారెడ్ కూనీ హోర్వాత్ రూపొందించిన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుత తరం పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం గత తరాల కంటే తగ్గుతోందని హోర్వాత్ ఆ వీడియోలో వివరించారు. పిల్లలు గతంలో కంటే ఎక్కువ కాలం విద్యను అభ్యసిస్తున్నప్పటికీ.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అక్షరాస్యత మరియు గణిత నైపుణ్యాలలో వెనుకబడి ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం నిరంతరం స్క్రీన్ల ముందు గడపడమేనని, దీనివల్ల మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానం మారిపోతోందని హెచ్చరించారు.

అటెన్షన్ సమస్యే ప్రధానం

కామత్ పోస్ట్‌పై ఇంటర్నెట్‌లో భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఒక యూజర్ స్పందిస్తూ, “రెండు దశాబ్దాల క్రితం ఖాళీ సమయాన్ని బోర్డమ్‌గా భావించేవాళ్లం కాదు, కానీ నేటి తల్లిదండ్రులు పిల్లలను హ్యూమనాయిడ్స్ లాగా తయారు చేస్తున్నారు” అని విమర్శించారు. మరో వ్యక్తి, “ఇది కేవలం స్క్రీన్ టైమ్ సమస్య మాత్రమే కాదు, ఏకాగ్రత సమస్య. మనం బోర్డమ్‌ను డిస్ట్రాక్షన్‌తో భర్తీ చేశాం, తద్వారా సృజనాత్మకత పుట్టే ఖాళీ ప్రదేశాన్ని కోల్పోయాం” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం వల్ల తల్లిదండ్రులకు సహాయం చేసేవారు లేక, వారు తమ పనుల కోసం పిల్లల చేతికి ఫోన్లు ఇస్తున్నారని మరికొందరు విశ్లేషించారు.

Follow Us