AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Class Results 2026: ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ, డైరెక్ట్ లింక్ ఇక్కడ తెలుసుకోండి

AP 10th Class Results 2026 Date: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది. SSC పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మూల్యాంకనం పూర్తి కావడంతో, ఫలితాల ప్రాసెసింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ఫలితాల విడుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

AP 10th Class Results 2026: ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ, డైరెక్ట్ లింక్ ఇక్కడ తెలుసుకోండి
Ap Class 10 Results 2026
Rajashekher G
|

Updated on: Apr 22, 2026 | 6:22 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు పూర్తవడంతో.. ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులందరూ ఫలితాలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3న పరీక్షలు ముగియగా, ఏప్రిల్ 15 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. అందుతున్న సమాచారం ప్రకారం, మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశముంది. ఈసారి మార్కుల లెక్కింపులో పొరపాట్లు నివారించేందుకు ప్రభుత్వం ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యాంకన కేంద్రాల్లో మార్కులను చేతితో నమోదు చేయడంతో పాటు ట్యాబ్‌లలో కూడా వెంటనే అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా, అధికారులు వాటిని త్వరగా పరిష్కరించి ప్రక్రియను సాఫీగా కొనసాగించారు.

ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, హాజరు శాతం సుమారు 99.5% గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 3415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ జరుగుతోంది. అన్నీ సవ్యంగా సాగితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది.

ఇక తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న పూర్తయ్యాయి. అక్కడ సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణలో కూడా మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూల్యాంకనం ఇప్పటికే పూర్తయినందున, ఫలితాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ను సందర్శించవచ్చు. అదేవిధంగా 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.

Follow Us
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్