AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ నుండి అమెరికాకు నడక దారి..రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు! వైరల్ అవుతున్న రోడ్‌ మ్యాప్

విమానం, ఫ్లైట్ లేకుండా కాలినడకన భారతదేశం నుండి అమెరికా చేరుకోవాలని మీరు ఎప్పుడైనా కలగన్నారా? ఇప్పుడు, మీరు ఆ కల నిజం చేసుకోవచ్చు. విమానంలో అమెరికా వెళ్లడానికే సుమారు 15 నుండి 20 గంటల సమయం పడుతుంది. అలాంటిది కాలినడకన అమెరికా వెళ్లడం అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక మ్యాప్, దాని లెక్కలు ఇప్పుడు నెటిజన్లను ఆలోచనలో పడేశాయి.

భారత్ నుండి అమెరికాకు నడక దారి..రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు! వైరల్ అవుతున్న రోడ్‌ మ్యాప్
Walk From India To UsaImage Credit source: instagram
Jyothi Gadda
|

Updated on: Apr 22, 2026 | 5:45 PM

Share

విమానం, ఫ్లైట్ లేకుండా కాలినడకన భారతదేశం నుండి అమెరికా చేరుకోవాలని మీరు ఎప్పుడైనా కలగన్నారా? ఇప్పుడు, ఆ కల నిజం కావచ్చు. రోజుకు కేవలం 15 కిలోమీటర్లు నడిస్తే చాలు.. 20 ఏళ్లలో భారతదేశం నుండి అమెరికా చేరుకోవచ్చని సూచిస్తూ ఒక ప్రత్యేకమైన నడక మార్గం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాయుమార్గ దూరం సుమారు 16,000 కిలోమీటర్లు అయినప్పటికీ, వైరల్ అవుతున్న ఈ మార్గంలో అనేక దేశాలు, పర్వతాలు, అడవులు, రోడ్లు ఉండటం వల్ల, మొత్తం నడక దూరం గణనీయంగా పెరుగుతుంది. దీనిని చూసి వినియోగదారులు ఆశ్చర్యపోతూ, మీరు కూడా కాలినడకన అమెరికాకు వెళ్ళవచ్చు! అని అంటున్నారు. ఈ మార్గం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా షేర్ చేయబడుతోంది. ఒక వినియోగదారుడు గూగుల్ మ్యాప్స్, వివిధ ట్రావెల్ బ్లాగ్‌ల ఆధారంగా ఈ మొత్తం మార్గాన్ని రూపొందించారు.

ఈ ప్రయాణ మార్గం ఎలా ఉంటుంది?:

ఈ నడక ప్రయాణం భారతదేశం నుండి మొదలై పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ మీదుగా రష్యాలోని అత్యంత తూర్పు ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడి నుండి అమెరికాలోని అలాస్కా రాష్ట్రం కనిపిస్తుంది. రష్యా, అమెరికా మధ్య కేవలం 80 నుండి 90 కిలోమీటర్ల సముద్ర దూరం (బేరింగ్ జలసంధి) మాత్రమే ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి ఈ సముద్రం గడ్డకట్టినప్పుడు, దానిపై నడిచి అమెరికాలోకి ప్రవేశించవచ్చని ఈ వైరల్ పోస్ట్ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

భారత్ నుండి అలాస్కా వరకు సుమారు 1,10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది.ఒక వ్యక్తి రోజుకు విరామం లేకుండా 15 కిలోమీటర్లు నడిస్తే ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 20 ఏళ్ల సమయం పడుతుందని అంచనా. ఇన్ని దేశాల గుండా వెళ్లడానికి వీసా పొందడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా రష్యా-అమెరికా సరిహద్దుల్లో కఠినమైన నిబంధనలు ఉంటాయి. సైబీరియా వంటి ప్రాంతాల్లో మైనస్ 50 డిగ్రీల చలిలో నడవడం ప్రాణాపాయం.

ఏళ్ల తరబడి అడవులు, ఎడారులు, మంచు పర్వతాల గుండా వెళ్లేటప్పుడు ఆహారం, రక్షణ దొరకడం చాలా కష్టం అవుతుంది. భౌగోళికంగా భూమిపై మార్గం ఉన్నప్పటికీ, పైన పేర్కొన్న కారణాల వల్ల ఇది కేవలం ఒక కాన్సెప్ట్, థియరీ మాత్రమే. సాహస యాత్రికులు కూడా ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం చాలా అరుదు. కానీ, ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు.. ఎక్కడ
ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు.. ఎక్కడ
ఇవి రెండు ఆకులు నమిలితే షుగర్ జీవితంలో రాదు.! ఇక మందులతో పనుండదు
ఇవి రెండు ఆకులు నమిలితే షుగర్ జీవితంలో రాదు.! ఇక మందులతో పనుండదు
భారత్ నుండి అమెరికాకు నడక దారి!రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు
భారత్ నుండి అమెరికాకు నడక దారి!రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు
ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు!
ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు!
రూ.15వేలలోపు చెల్లింపులు చేస్తున్నారా..? ఆర్బీఐ ఊరట..
రూ.15వేలలోపు చెల్లింపులు చేస్తున్నారా..? ఆర్బీఐ ఊరట..
సెంచరీ కొట్టావ్ సామీ.. ఇంకేం నేర్చుకుంటావ్?
సెంచరీ కొట్టావ్ సామీ.. ఇంకేం నేర్చుకుంటావ్?
మనీ ప్లాంట్‌తో ఈ మొక్క నాటితే ఇంట్లో సంపద పెరుగుతుందా? వాస్తు..
మనీ ప్లాంట్‌తో ఈ మొక్క నాటితే ఇంట్లో సంపద పెరుగుతుందా? వాస్తు..
ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు
ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..