AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home cooling: ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.. జస్ట్‌ ఫ్యాన్ ఉంటే చాలు

ఏప్రిల్ నెల నుండే ఎండలు మండిపోతున్నాయి. బయట వడగాల్పులు, ఇంట్లో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏసీ గదిలోకి అడుగుపెట్టగానే కలిగే ఆ హాయి మాటల్లో చెప్పలేం. కానీ, గంటల తరబడి ఏసీలో కూర్చుంటే చర్మం పొడిబారడం, గొంతులో గరగర వంటి సమస్యలు వస్తుంటాయి. దానికి తోడు నెల తిరిగే వరకు కరెంటు బిల్లు కూడా వాచిపోతుంది. ఈ క్రమంలో ఏసీ లేకుండానే ఇంటిని చల్ల బరిచే ఓ దేశీ చిట్కా ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిన్న చిట్కాను పాటిస్తే మన ఇంట్లో ఉన్న ఫ్యాన్‌తోనే రూమ్‌ను కూల్‌ కూల్‌గా ఉంచుకోవచ్చు. అదెలానో చూద్దాం.

Home cooling: ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.. జస్ట్‌ ఫ్యాన్ ఉంటే చాలు
Home Cooling Without Ac
Anand T
|

Updated on: Apr 22, 2026 | 5:42 PM

Share

సమ్మర్ మనం ఇంటిని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇందుకోసం చాలా మంది ఏసీలు, కూలర్లు వాడుతూ ఉంటారు. కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారు అంత డబ్బులు పెట్టి ఏసీ, కూలర్లు కొనలేరు. అలా అని ఉక్కపోతలో ఉండాలంటే నరకమనే చెప్పాలి. కాబట్టి అలాంటి వారికి ఉపశమనం కల్గించేలా చిట్కాను ఇప్పుడు చెప్పబోతున్నాం. మీ ఇంట్లో జస్ట్‌ ఫ్యాన్ ఒక బకెట్ ఉంటే చాలూ ఇంటిని మీరు చల్లగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం మీరు ఒక బకెట్‌లో నీళ్లు నింపి ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది. అలానే మీ ద్గగర కొన్ని పాత కర్లెన్స్ వంటివి ఉంటే వాటిని తడిపి రూమ్‌లో ఫ్యాన్‌ కింద ఆరవేయడం ద్వారా ఇళ్లు చల్లబడుతుంది.

వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల చర్మం పొడిబారడం, పెదవులు పగలడం, కళ్లు మండటం వంటివి జరుగుతాయి. గదిలో నీళ్లు ఉంచడం వల్ల గాలిలో తేమ పెరిగి గది చల్లబడుతుంది. అలాగే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. గాలి పొడిగా ఉంటే గొంతు ఎండిపోవడం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సైనస్ లేదా శ్వాస సమస్యలు ఉన్నవారికి ఈ నీళ్ల బకెట్ చిట్కా ‘నేచురల్ హ్యూమిడిఫైయర్’ లా పనిచేస్తుంది. గాలిలో తగినంత తేమ ఉంటే శ్వాస తీసుకోవడం సులభమవుతుంది, తద్వారా నిద్ర మధ్యలో మెలకువ రాకుండా గాఢ నిద్ర పడుతుంది. గాలిలో తేమ లేకపోతే చెక్క ఫర్నిచర్ పగుళ్లు ఇచ్చే అవకాశం ఉంది, అలాగే ఇంట్లోని మొక్కలు త్వరగా వాడిపోతాయి. గదిలో నీళ్లు ఉంచడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

ఎలా ఉపయోగించాలి?

ఇవి కూడా చదవండి

ఈ చిట్కా చాలా సులభం ఇందుకోసం ముందుగా ఒక బకెట్‌ తీసుకొని దాని నిండా నీటిని నింపండి. తర్వాత దాన్ని గదిలోని ఒక మూలలో లేదా కిటికీ దగ్గర ఉంచండి. ఇలా ఉంచడం ద్వారా ఇది బయట నుంచి వచ్చే వేడి గాలిని తగ్గిస్తుంది. అలానే గాలిలో లేమను పెంచి రూమ్‌ను చల్లబరుస్తుంది. అయితే ఆ బకెట్‌లోని నీటిని ప్రతిరోజూ మార్చడం మర్చిపోవద్దు. ఇంకా మీ గదిలో సువానగా ఉండాలంటే ఆ నీటిలో కొన్ని నిమ్మ తొక్కలు లేదా మీకు నచ్చి పర్యూమ్ లేదా కంఫర్ట్‌ వంటివి వేసుకోవడం ద్వారా గది మంచి సువాసనతో నిండిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ
విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..
విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..
ఆషాఢ అమావాస్య.. పితృదేవతల ఆశీర్వాదం పొందే మహా పుణ్యదినం.. తర్పణం
ఆషాఢ అమావాస్య.. పితృదేవతల ఆశీర్వాదం పొందే మహా పుణ్యదినం.. తర్పణం
ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్..
ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్..
12 ఏళ్లుగా దక్కని విజయం.. సీక్రెట్ ప్లాన్‌తో ఆసీస్ బరిలోకి..
12 ఏళ్లుగా దక్కని విజయం.. సీక్రెట్ ప్లాన్‌తో ఆసీస్ బరిలోకి..
ఓరీ దేవుడో.. ఈ కలర్‌ ఫుల్‌ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..?
ఓరీ దేవుడో.. ఈ కలర్‌ ఫుల్‌ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..?
జీవితమంతా పిల్లల కోసమే.. చివరి ప్రయాణంలో మాత్రం..!
జీవితమంతా పిల్లల కోసమే.. చివరి ప్రయాణంలో మాత్రం..!
21 ఏళ్ల క్రితం అలా.. ఇప్పుడు ఇలా.. సక్సెస్ అంటే ఇదే..
21 ఏళ్ల క్రితం అలా.. ఇప్పుడు ఇలా.. సక్సెస్ అంటే ఇదే..
మహిళా రైతును అమాంతం మింగేయబోయిన కొండచిలువ.. ఆ తర్వాత జరిగిందిదే
మహిళా రైతును అమాంతం మింగేయబోయిన కొండచిలువ.. ఆ తర్వాత జరిగిందిదే
అమ్మాయిలతో జాగ్రత్త.. ఆ ఇద్దరిలా అస్సలు మారొద్దు
అమ్మాయిలతో జాగ్రత్త.. ఆ ఇద్దరిలా అస్సలు మారొద్దు