- Telugu News Photo Gallery Kerala wayanad landslides disaster photos many deaths villages destroyed , Death count rises
ప్రకృతి కరాళ నృత్యం.. గ్రామాలకు గ్రామాలే ధ్వంసం.. నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకున్న వందలాది మంది.. ఫోటోలు చూస్తే కన్నీరు ఆగదు..
ప్రకృతిపై మనిషి పై చేయి సాధించానని సంబరపడినప్పుడల్లా.. నేను అంటే ఇది అంటూ ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. భూకంపాలు, సునామీ, వరదలు, వర్షాలు ఇలా రకరకాల కారణాలతో మానవుల జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుస్తుంది. కనులు మూసి తెరచేలోగా ప్రకృతి చేసిన విలయ తాండవానికి.. ప్రకృతి రాసే విషాద గీతానికి కొంతమంది వ్యక్తులు సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోతాం. తాజాగా కేరళలో వర్షాలు, వరదలు విధ్వసం సృష్టించింది. రాత్రికి రాత్రే గ్రామాలు ధ్వసం అయ్యాయి. ఏమి జరుగుతుందో తెలియకుండానే నిద్రలోనే వందలాది మంది మరణించారు.
Updated on: Jul 31, 2024 | 1:15 PM

అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కేరళ వాయనాడ్ లో భారీ వర్షాలతో అతిపెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గ్రామం తర్వాత గ్రామం ధ్వంసమైంది. అనేక కుటుంబాలు ధ్వంసమయ్యాయి. జులై 30 ఉదయం ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిరంతర భారీ వర్షాల వలన సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

నదులలో శవాలు తేలుతూ వస్తున్నాయి. బురద ప్రవాహం మధ్య ప్రజల శరీర భాగాలు కూడా కనుగొనబడుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన.. ఎక్కడ చూసినా బాధితులు, ప్రజల అరుపులు మిన్నంటుతున్నాయి.

వాయనాడ్ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌లకు ఆటంకం కలుగుతోంది, అయినప్పటికీ వాతావరణ పరిస్థితులకు ఎదురీదుతూ తప్పిపోయిన వారి కోసం ఆర్మీ, నేవీ, NDRF రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి.

తెల్లవారుజామున ప్రజలు తమ ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కొండచరియలు విరిగి పడడంతో చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఎక్కడ చూసినా విషాదమే, గ్రామాలకు గ్రామాలే మాయం అయ్యాయి. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి . నదులు ఉప్పొంగుతున్నాయి. వందలాది మంది కనిపించడం లేదు.

ఇప్పటి వరకు ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. శిథిలాలలో లభించిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వివిధ ఆసుపత్రుల మార్చురీలకు తరలిస్తున్నారు.

వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వస్తున్న చిత్రాలలో విధ్వంసం దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనం పూర్తిగా పాడైపోయి మట్టిలో ఎలా కప్పబడిందో ఈ చిత్రాలలో చూడవచ్చు. కుప్ప కూలిన ఇల్లు, విరిగిన వాహనాలకు సంబంధించిన భయానక దృశ్యాలు చూస్తే కొండచరియలు చేసిన గాయాన్ని అంచనా వేయవచ్చు.

వాయనాడ్ ప్రజలకు జూలై 30, 2024 తేదీ చాలా బాధాకరమైన రోజుగా నిలిచిపోతుంది. చాలా మందికి కళ్ళు తెరవడానికి కూడా అవకాశం లేదు. అక్కడ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, నదుల ప్రవాహానికి పలువురు గల్లంతయ్యారు.

కొండచరియలు విరిగిపడటంతో నదుల ప్రవాహం వేగంగా మారింది. శిథిలాలలో చిక్కుకుని చాలా మంది చనిపోయారు. పలువురు కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించారు.

నదుల ప్రవాహం ఉధృతంగా మారింది. దీంతో ప్రజలతో పాటు పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. గ్రామ ప్రాంతాలలో చుట్టూ నీరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పకృతి చేసిన విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది.

భారీ వర్షాల మధ్య ప్రజలను రక్షించే పనిలో NDRF కి చెందిన మూడు బృందాలు పనిచేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ప్రభావిత ప్రాంతాన్ని సమీప పట్టణానికి కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. భారత సైన్యం తాడుతో కలుపుతూ సహాయక చర్యలను చేస్తోంది.

ముండకైలో అనేక మృతదేహాలు పేరుకుపోయినట్లు సమాచారం. వీటిని మేపాడుకు తరలించ చేయలేకపోయారు. కుప్పకూలిన భవనాలపై మృతదేహాలు పడి ఉన్నాయని ముండకై సమాచారం అందింది. అక్కడికి చేరుకోవడానికి మార్గం లేదు.. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఇళ్లు ధ్వంసమై ఆహారం, నీరు కరువయ్యాయి. 12 గంటల పాటు విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో చాలా మంది ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ కావడంతో రెస్క్యూ ఆపరేషన్లపై ఈ ప్రభావం పడింది.




