- Telugu News Photo Gallery Jaggery with Curd benefits to cure these health issues Telugu Lifestyle News
Curd with Jaggery: పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..? బెల్లం, పెరుగులో దాగివున్న పోషకాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రెండింటి కలయిక రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. ఇమ్యూనిటి పవర్‌ను పెంచేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన అనేక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్‌ని కలిగి ఉంటుంది.పెరుగు, బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 20, 2024 | 8:26 PM

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, మీరు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటే, మీరు పెరుగు, బెల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: జీర్ణవ్యవస్థ సరిగా పని చేయనప్పుడు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వాంతులు వంటి సమస్యలు సర్వసాధారణం. పెరుగు, బెల్లం రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

రక్తహీనతను నివారిస్తుంది: శరీరంలో రక్తహీనతతో బాధపడేవారు పెరుగు , బెల్లం కలిపి రోజూ తింటే శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: మీరు బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నట్టయితే, మీ రోజువారీ ఆహారంలో పెరుగు, బెల్లం కలుపుకుని తినటం మంచిది. పెరుగు, బెల్లం తినడం వల్ల మీ కడుపు గంటల తరబడి నిండుగా ఉంటుంది. ఇది సులభంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మహిళలకు పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ క్రాంప్ సమయంలో మహిళలు పెరుగులో బెల్లం కలిపి తినాలి. కడుపు తిమ్మిరిని కూడా తొలగిస్తుంది.




