- Telugu News Photo Gallery Is weakness bothering you? If you eat these foods, the problem will go away.
Weakness: బలహీనత ఇబ్బంది పెడుతుందా.? ఈ ఫుడ్స్ తీసుకొంటే సమస్య ఆమడ దూరం..
ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేం ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు శరీరంలోని బలహీనతకు కారణం ఏంటీ.. దాన్ని దూరం చేయడానికి ఆహారంలో ఎలాంటి పదార్థాలను చేర్చుకోవాలి.. అనే విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Jun 24, 2025 | 9:50 AM

ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేం ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో బలహీనతకు కారణం: విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తాయి. ఇది ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల కూడా ఇలా జరుగుతుంది. శరీరంలో బలహీనత ఉంటే ఆహారంలో వీటిని జోడించండి..

పచ్చి కూరగాయలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఫైబర్ కూరగాయలలో లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దీంతో పొట్ట త్వరగా నిండడంతో పాటు ఆకలిని ఎక్కువసేపు అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గుతుంది. ఊబకాయం పెరగదు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పచ్చి కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

తగినంత నిద్రపోయిన తర్వాత కూడా మీరు అలసిపోయినట్లు అనిపిస్తే, దానికి కారణం ప్రోటీన్ లోపం కావచ్చు. శరీరానికి శక్తినిచ్చే హార్మోన్లు, ఎంజైమ్‌లను తయారు చేయడానికి ప్రోటీన్ అవసరం. దీని లోపం బలహీనత, బద్ధకం, మానసిక అలసటను పెంచుతుంది. ప్రోటీన్‌లో ఉండే కెరాటిన్, కొల్లాజెన్ జుట్టు, చర్మం, గోళ్లకు చాలా ముఖ్యమైనవి. శరీరానికి తగినంత ప్రోటీన్ అందనప్పుడు, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది, గోళ్లు విరిగిపోతాయి. చర్మం పొడిగా మారుతుంది.

నట్స్, తృణ ధాన్యాలు తినండి: శరీరంలో బలహీనత ఉన్నప్పుడు నట్స్, తృణ ధాన్యాలు తినవచ్చు. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా అవి సులభంగా జీర్ణమవుతాయి. మరోవైపు ప్రతిరోజూ నట్స్, తృణ ధాన్యాలును తీసుకుంటే మీ బలహీనత, అలసట తొలగిపోతుంది.




