AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon Seeds Benefits : గింజ గింజలో ఆరోగ్యం.. అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

వేసవి కాలంలో విరివిగా లభించే పుచ్చపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండలో దాహార్తిని తీర్చేందుకు ముందు వరుసలో ఉంటుంది పుచ్చపండు. అయితే, మనందరం ఈ పండు తినేసి గింజలు ఊసేస్తాం. కానీ, అది చాలా పొర‌పాటు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుచ్చకాయ గింజలు అంత రుచిగా ఉండకపోయినా గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. పుచ్చపండు గింజలతో కలిగే లాభాలేంటో పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jun 24, 2025 | 8:36 AM

Share
పుచ్చపండులోని నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చపండు ఓ వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు.. భోజనం తర్వాత పుచ్చపండు రసం తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఊబకాయాన్ని తగ్గించడంలో ఇది ఎంతో తోడ్పడుతుంది.

1 / 5
పుచ్చపండు గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి.  ఈ గింజల్లో ఉండే ఆమైనో ఆసిడ్స్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. పుచ్చగింజల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

2 / 5
పుచ్చపండులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి..పుచ్చకాయ గింజలలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఎముకలు కాకుండా, కండరాల పనితీరును పెంచడంలో, నరాలను చురుకుగా ఉంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.

3 / 5
పుచ్చకాయ గింజల్లో ఉండే లైసిన్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు.. పుచ్చకాయ గింజల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.. ఇది లైకోపీన్ వల్ల క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది. మెదడు నరాలను బలపరుస్తుంది. కామెర్లు వంటి సమస్యలలో పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
పుచ్చకాయ గింజల్లో ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడం, డ్యామేజ్‌ని నిరోధించడంలో సహాయపడతాయి. తరచూ పుచ్చకాయ గింజలు తినటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

5 / 5