ఉరుకులు పరుగుల జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఆరోగ్యం దెబ్బతింటోంది. అయితే.. ఈ బిజీ లైఫ్‌లో పురుషుల బాధ్యతలు గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి.. దీని కారణంగా వారు తరచుగా తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. లేకపోతే పురుషులు లైంగిక సమస్యలతోపాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వారికి అంజీర్ బెస్ట్ అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషులు ప్రతిరోజూ అత్తి పండ్లను తీసుకుంటే.. అనేక ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు. అంజీర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అత్తిపండ్లలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. అత్తి పండ్లలో ఫైబర్, కాపర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ K, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.. అంతేకాకుండా మలబద్దకాన్ని దూరం చేస్తాయి. అత్తి పండ్లను తినడం వల్ల పురుషులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకోండి..