- Telugu News Photo Gallery In India, the steering of vehicles is on the right side, but in some countries, why is it on the left side?
భారత్‌లో వాహనాలకు స్టీరింగ్ కుడి వైపు.. అక్కడ ఎడమ వైపు.. ఎందుకు.?
మనం రోడ్డుపై వెళ్తున్న కార్లు, బస్సులు, ట్రక్కులు, బైక్‌లు, టెంపోలు లాంటివి కనిపిస్తాయి. భారతదేశంలో అన్ని వాహనాల స్టీరింగ్ ఎల్లప్పుడూ కుడి వైపు ఉంటుంది. అలాగే డ్రైవింగ్ ఎడమ వైపు చేస్తారు. అయితే మరికొన్ని దేశాల్లో వాహనాలకు స్టీరింగ్ ఎడమ వైపు ఉంటుంది. కుడి వైపు డ్రైవింగ్ చేస్తుంటారు. ఎందుకు ఇలా? ఈరోజు మనం తెలుసుకుందాం రండి..
Updated on: Aug 16, 2025 | 11:09 AM

ఒకే మోడల్ కార్లు అనేక దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటి స్టీరింగ్ వీల్స్ కొన్నిచోట్ల కుడి వైపు ఉంటే, కొన్నిచోట్ల ఎడమ వైపు ఉంటుంది. మరీ ఇలా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికా సహా అనేక ఐరోపా దేశాల్లో వాహనాల స్టీరింగ్ వీల్స్ ఎడమ వైపు ఉంటాయి. కానీ భారతదేశంలో మాత్రం స్టీరింగ్ వీల్స్ కుడి వైపు ఉంటాయి. ఎడమ వైపు డ్రైవింగ్ చేస్తారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.

బ్రిటిష్ పాలనలోనే మోటారు వాహనాలు భారతదేశానికి వచ్చాయని తెలిసిందే. బ్రిటన్ దేశంలో వారు తయారు చేసిన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకొని ఉపయోగించేవారు. వీటికి స్టీరింగ్ కుడి వైపు ఉండేది. భారతదేశంలో 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలన కొనసాగింది. అందుకే భారతదేశంలో ప్రజలకు కుడి వైపు స్టీరింగ్‌తో వాహనాలు నడపడం అలవాటైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇదే కొనసాగుతూ వస్తుంది.

అయితే అమెరికాలో మాత్రం వాహనాలు ఎడమ వైపు స్టీరింగ్ ఉంటుంది. 18వ శతాబ్దంలో టీమ్‌స్టర్స్ గుర్రపు బండ్లను తోలుతుండేవారు. ఈ బండ్లలో సామాను ఉంచడానికి కుడి వైపునఉంచి స్వారీ చేసేవారు ఎడమ వైపు కూర్చునేవారు. తర్వాత అక్కడ కారు కనిపెట్టినప్పుడు, ఇంజనీర్లు అదే పద్ధతిని కొనసాగించారు. కార్లు, ట్రక్కులు లాంటి వాహనాల్లో స్టీరింగ్ వీల్‌ను ఎడమ వైపు అమర్చారు.

మొదట్లో అమెరికా నుండి ఐరోపా ఇతర దేశాలకు కార్లు ఎగుమతి చేసుకొనేవారు. అందుకే ఐరోపాలో కూడా ఎడమ వైపు స్టీరింగ్ ఉన్న వాహనాలు డ్రైవ్ చెయ్యడం అలవాటు అయింది. ఇప్పటికి వాహనాల స్టీరింగ్ విషయంలో ఆ పెద్దదినే కొనగిస్తున్నాయి ఆ దేశాలన్నీ. కుడి వైపు డ్రైవింగ్ చేస్తుంటారు.

ఇక్కడ స్టీరింగ్ ఎడమ వైపు ఉండటానికి మరొక కారణం కూడా ఉంది. అమెరికా సహా ఐరోపాలోని అనేక దేశాల్లో వాహనాలను రోడ్డుకు కుడి వైపున డ్రైవ్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్ కారుకు ఎడమ వైపు కూర్చుంటే ఎదురుగా వచ్చే వాహనం వేగం, దూరాన్ని అంచనా వేయడం సులభంగా ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలను నివారించవచ్చు.




