- Telugu News Photo gallery Improve eyesight here are the foods that maintain eye health in Telugu health tips
Eye Health : చక్కటి కంటి చూపు కోసం ఉత్తమ ఆహారాలు ఇవే!
నేటి జీవనశైలిలో, పెద్దవారి కంటే పిల్లలు, యుక్తవయస్కుల వారిలోనే దృష్టి లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని ఆహార చిట్కాలు ఉన్నాయి.
Updated on: Jan 13, 2023 | 2:52 PM

నేటి ఆధునిక జీవనశైలిలో పెద్దవారి కంటే పిల్లలు, యుక్తవయస్కుల వారిలోనే దృష్టి లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. నాసిరకం ఆహారాలు, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం కూడా ఇలాంటి సమస్యలకు కారణం కావచ్చు.

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని ఆహార చిట్కాలు ఉన్నాయి. మీ రోజువారీ ఆహారంలో ఇలాంటి ఆహారాన్ని చేర్చుకోవటం వల్ల కంటిచూపును కాపాడుకోవచ్చు.

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్ ఎ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు ఉండేలా చూసుకోండి.

చేప: విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఆహారాలలో చేపలు కూడా ఒకటి. కాబట్టి మీ ఆహారంలో చేపలను కూడా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపలలోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వయస్సు సంబంధిత మచ్చల క్షీణత, దృష్టి లోపం ఉన్నవారికి కళ్ళకు అవసరమైన పోషకాలను అందించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

ఆకు కూరలు: ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలు హెల్తీ డైట్ ప్లాన్ లో నంబర్ వన్. పాలకూర, బచ్చలికూర మీ శరీరానికి చాలా పోషకాలను అందిస్తుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.

టొమాటో పండులో సహజసిద్ధమైన విటమిన్లు ఎ, సి, కె, బి పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా మేలు చేస్తాయి. ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, జింక్, ఫాస్పరస్ కూడా ఉన్నాయి.

క్యారెట్‌లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ క్యారెట్‌లను పచ్చిగా లేదా ఉడికించి కూడా తీసుకోవచ్చు.

చిలగడదుంపలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి, మధుమేహానికి కూడా ఇది మంచి ఔషధం.





























