Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday Puja Tips: శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..

హిందూ పురాణగ్రంథాలలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించి, నియమ నిష్టలతో ఉపవాసం ఉండే ఆచారం ఉంది. శుక్రవారం రోజున పూజలు, ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని నమ్ముతారు. అమ్మ ఆశీర్వాదంతో జీవితంలో ఎప్పుడూ సంపదకు, ఆహారానికి లోటు ఉండదని విశ్వాసం. అయితే లక్ష్మీదేవిని ఎనిమిది స్వరుపాలుగా భావించి పుజిస్తారు. అష్ట లక్ష్మి(గుప్త లక్ష్మి) ని శుక్రవారం ఎలా పూజిస్తే శుభాలను కలుగజేస్తుందంటే..

Friday Puja Tips: శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
Gupta Lakshmi Puja
Follow us
Surya Kala

|

Updated on: Mar 13, 2025 | 8:46 PM

పురాణాల్లో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీ దేవి జన్మించింది. హిందూ మత గ్రంథాలలో లక్ష్మీ దేవిని సిరి సంపదలకు అధిదేవతగా భావిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని పూజించడం, ఉపవాసం ఉండటం నియమాల ప్రకారం చేయాల్సి ఉంటుంది. హిందువుల నమ్మకం ప్రకారం, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తి ఇంట్లో ధన, ధాన్యాలకు కొరత ఉండదు. ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది. అందుకనే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ విషయం గురించి అందరికీ తెలుసు. అయితే శుక్రవారం గుప్తలక్ష్మిని పూజిస్తారని మీకు తెలుసా. నిజానికి గుప్త లక్ష్మిని ధూమావతి అని, అష్ట లక్ష్మి అని కూడా పిలుస్తారు. శుక్రవారం రోజున గుప్త లక్ష్మి (అష్ట లక్ష్మి) ని పూజించే వారి ఇంటి ఖజానా ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉంటుందని నమ్మకం.

గుప్త లక్ష్మి పూజా విధానం

  1. లక్ష్మీ దేవిని పూజించడానికి రాత్రి సమయం పవిత్రమైనదని శాస్త్రాలలో చెప్పబడింది.
  2. శుక్రవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య లక్ష్మీ దేవిని పూజించాలి.
  3. పూజ చేయడానికి ముందుగా శుభ్రమైన బట్టలు ధరించాలి.
  4. తరువాత పూజ చేసేందుకు పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై గులాబీ రంగు వస్త్రాన్ని పరిచి.. దానిపై శ్రీ యంత్రం, గుప్త లక్ష్మి (అష్ట లక్ష్మి) విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి.
  5. తరువాత అమ్మవారి ముందు 8 నెయ్యి దీపాలు వెలిగించాలి.
  6. తరువాత అష్టగంధంతో శ్రీ యంత్రానికి, అష్ట లక్ష్మికి బొట్టు పెట్టాలి.
  7. గుప్త లక్ష్మీదేవిని ఎర్ర మందార పూల మాలతో అలంకరించాలి.
  8. గుప్త లక్ష్మికి నైవేద్యంగా బియ్యంతో చేసిన పాయసాన్నిసమర్పించాలి.
  9. ‘ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీయై హ్రీం సిద్ధయే మమ గృహే అగచ్ఛగచ్ఛ నమః స్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
  10. పూజ అనంతరం చివరగా అమ్మవారికి హారతినివ్వాలి.
  11. తరువాత ఎనిమిది దీపాలను ఇంట్లోని ఎనిమిది దిక్కులలో ఉంచాలి.

లక్ష్మీ దేవిని పూజించడంప్రాముఖ్యత

హిందూ మతంలో లక్ష్మీ దేవిని ఇంట్లో ధన ధాన్యాలకు, సిరి సంపదలను అందించే దేవతగా మాత్రమే కాదు సుఖ సంతోషాలను అందించే దైవంగా కూడా పూజిస్తారు. గుప్త లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా ప్రతికూల శక్తులు కూడా నశిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు