Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
హోలీ పండుగ రోజున (మార్చి 14న) ఈ ఏడాదిలో మొదటి గ్రహణం సంభవించనుంది. మార్చి 13-14 రాత్రి అద్భుతమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. ఆకాశంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. హోలీ రోజున చంద్రుడు రక్తం (ఎరుపు) రంగులోకి మారనున్నాడు. మన దేశంలో గ్రహణాన్ని చూడలేము. అయినా సరే కొన్ని రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.

హోలీ పండగ రోజున (మార్చి 14) ఆకాశంలో ఒక అద్భుతం చోటు చేసుకోబోతోంది. అదే బ్లడ్ మూన్. ఈ ఏడాది మొదటి గ్రహణం…శుక్రవారం అంటే హోలీ రోజున సంభవిస్తోంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. బ్లడ్ మూన్ అని పిలవబడే చంద్రగ్రహణం ఈసారి ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరళరేఖ పై ఉన్న సమయంలో చంద్రుడిపై భూమి నీడ పడడం వలన పూర్తిగా కప్పేస్తుంది. దీనిని చంద్ర గ్రహణం అంటారు. గ్రహణం సమయంలో చంద్రుడు ఎప్పుడూ కనపడే రంగులోనే ఉంటాడు. కానీ, ఈ బ్లడ్ మూన్ సమయంలో మాత్రం చంద్రుడు పూర్తిగా ఎరుపు లేదా నారింజ రంగులో వచ్చి కనువిందు చేస్తాడు.
సూర్యుడి నుంచి వచ్చే ఎరుపు లేదా నారింజ కిరణాలు భూమిపై నుంచి ప్రయాణం చేసి చంద్రుడి వర్ణాన్ని మారుస్తాయి. దీనిని రేలీ స్కాటరింగ్ అంటారు. మన దేశంలో గ్రహణాన్ని చూడలేము. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో ఇది కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఇది ఒక ఖగోళ వింత మాత్రమేనని, అంతకంటే దీనికి ప్రాముఖ్యత లేదంటున్నారు కొందరు.
అయితే జ్యోతిష్యుల వాదన మరోలా ఉంది. ఇది కేతు గ్రస్త ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణమని, కొన్ని రాశుల వారిమీద దీని ప్రభావం ఉంటుందని వాళ్లు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..