Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mauritius: జన సమూహానికి దూరంగా ప్రకృతికీ దగ్గరగా గడపాలనుకుంటున్నారా .. మారిషస్‌లో ఈ ఐదు ప్రదేశాలు బెస్ట్ ఎంపిక..

జనసమూహానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా కొన్ని రోజులైనా గడపాలని కోరుకునేవారు మారిషస్‌కు పయణం అవుతారు. ఈ దేశంలో ఐదు అందమైన ప్రదేశాలున్నాయి. వీటిని మారిషస్ కు దాచుకున్న ఐదు రత్నాలు అని చెబుతారు చూసిన పర్యాటకులు. ఈ దేశంలో ఆహారం నుంచి రాత్రి జీవితం వరకు ప్రతిదీ చాలా బాగుంది. ఈ దేశం సందర్శించడానికి సరైన గమ్యస్థానం. అయితే మారిషస్‌లో ప్రశాంతంగా జన సమూహానికి దూరంగా సంతోషంగా గడపడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

Mauritius: జన సమూహానికి దూరంగా ప్రకృతికీ దగ్గరగా గడపాలనుకుంటున్నారా .. మారిషస్‌లో ఈ ఐదు ప్రదేశాలు బెస్ట్ ఎంపిక..
Uncover Mauritius Hidden Gems
Follow us
Surya Kala

|

Updated on: Mar 13, 2025 | 7:08 PM

మారిషస్ పేరు వినగానే అందమైన బీచ్‌లు, స్పష్టమైన నీలి రంగుతో కనువిందు చేసే సముద్రాలు, పచ్చని పర్వత దృశ్యాలు మనస్సులోకి వస్తాయి. మారిషస్ ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఇది సాధారణంగా హనీమూన్ డెస్టినేషన్ ప్రదేశంగా పిలువబడుతుంది. మారిషస్‌లో బీచ్‌లు మాత్రమే కాదు చాలా తక్కువ మంది పర్యాటకులకు తెలిసిన అనేక రహస్య ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉన్నాయి.

రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా కొత్తగా ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని.. మారిషస్ దేశంలోని నిజమైన అందాలను చూడాలనుకుంటే.. ఇక్కడ ప్రదేశాలను తప్పక సందర్శించాలి. ఈ ప్రదేశాలు శాంతి, సాహసం, ప్రకృతికి దగ్గరగా ఉండటం వంటి ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. కనుక మారిషస్‌లోని 5 అందమైన రహస్య ప్రదేశాలు ఏమిటంటే..

ఇవి కూడా చదవండి

గ్రిస్ గ్రిస్ బీచ్

మారిషస్‌లోని ప్రసిద్ధ బీచ్‌ల రద్దీకి దూరంగా ప్రశాంతమైన ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే.. గ్రిస్ గ్రిస్ బీచ్ మీకు సరైన గమ్యస్థానం. ఈ బీచ్ మారిషస్ దక్షిణ భాగంలో ఉంది. ఇక్కడి దృశ్యం స్వర్గం కంటే తక్కువ కాదు. ఈ బీచ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే ఇక్కడ జనసంచారం తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి సూర్యాస్తమయాన్ని చూడడం ఓ అందమైన మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది.

రోచెస్టర్ జలపాతం

మారిషస్‌లోని పచ్చని సహజ ప్రదేశాలను అన్వేషించాలనుకుంటే.. ఖచ్చితంగా రోచెస్టర్ జలపాతాలను సందర్శించండి. ఈ జలపాతం ప్రత్యేకమైన రాళ్ళు, స్పష్టమైన నీటికి ప్రసిద్ధి చెందింది. ఇది మారిషస్‌లోని అతిపెద్ద, అత్యంత అందమైన జలపాతాలలో ఒకటి. ఇక్కడ జలపాతం కింద స్నానం చేసి ఆనందించవచ్చు. సాహస ప్రియులకు, ఫోటోగ్రాఫర్లకు కూడా ఇది సరైన గమ్యస్థానం.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

View this post on Instagram

A post shared by J u l i e 🐙 (@juxplore)

లే మోర్నే బ్రబంట్

ఎవరికైనా ట్రెక్కింగ్, సాహసయాత్రలు అంటే ఇష్టం అయితే లే మోర్నే బ్రబంట్ కొండ మంచి ఎంపిక. ఇది మారిషస్‌లోని ఎత్తైన, చారిత్రాత్మక పర్వతాలలో ఒకటి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చబడింది. ట్రెక్కింగ్ ఆనందించడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం. ఈ పర్వతం పై నుంచి మారిషస్ అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. సాహసయాత్రలను ఇష్టపడేవారు, ప్రకృతి ప్రేమికులు అయితే ఈ ప్రదేశం మీకు సరైన ప్రదేశం అని చెప్పవచ్చు.

ఏడు రంగుల భూమి చామరెల్

మారిషస్‌లో మీరు విభిన్నమైన, ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా చామరెల్ సెవెన్ కలర్డ్ ఎర్త్‌ని సందర్శించండి. ఇక్కడ ఏడు వేర్వేరు రంగుల మట్టి కనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే చుట్టూ ఉన్న దట్టమైన అడవులు, పచ్చదనం ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

బ్లూ బే మెరైన్ పార్క్

భూమి మీద అందాలు మాత్రమే కాదు సముద్రం లోపల అందాలను చూడాలనుకుంటే.. బ్లూ బే మెరైన్ పార్క్ మంచి ఎంపిక. ఈ ప్రదేశం మారిషస్‌లోని అత్యంత అందమైన సముద్ర ప్రదేశాలలో ఒకటి, ఇక్కడ మీరు పగడపు దిబ్బలు, అరుదైన చేపలు, సముద్రపు లోతులను ఆస్వాదించవచ్చు. ఇక్కడ మీరు స్నార్కెలింగ్ , స్కూబా డైవింగ్ చేయవచ్చు. నీటి అడుగున అరుదైన సముద్ర జీవులు, పగడపు దిబ్బలను కూడా చూడవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..