AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్త ప్రవాహాన్ని తలపించేలా ‘బ్లడ్‌ రెయిన్‌’… ఇరాన్‌ బీచ్‌లో టూరిస్టులు మస్త్‌ ఎంజాయ్‌

సాధారణంగా వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతారు. అదే వర్షం ఎరుపు రంగులో పడితే.. యస్‌.. మీరు ఎప్పుడైనా బ్లడ్‌ రెయిన్‌ను చూశారా? అవును ఇరాన్‌లో రక్తం రంగులో వర్షం కురిసింది. ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోయింది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరింది. ఈ ఎర్రని వర్షపు నీటితో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతోంది. ఏటా ఈ దృశ్యం

రక్త ప్రవాహాన్ని తలపించేలా 'బ్లడ్‌ రెయిన్‌'... ఇరాన్‌ బీచ్‌లో టూరిస్టులు మస్త్‌ ఎంజాయ్‌
Blood Rain In Iran Beach
K Sammaiah
|

Updated on: Mar 13, 2025 | 3:14 PM

Share

సాధారణంగా వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతారు. అదే వర్షం ఎరుపు రంగులో పడితే.. యస్‌.. మీరు ఎప్పుడైనా బ్లడ్‌ రెయిన్‌ను చూశారా? అవును ఇరాన్‌లో రక్తం రంగులో వర్షం కురిసింది. ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోయింది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరింది. ఈ ఎర్రని వర్షపు నీటితో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు.

తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు రంగులో రక్తాన్ని తలపించేలా పారుతున్న వరద నీటిలో గంతులు వేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన వర్షం జలపాతంలా కిందకు దూకుతుంటే కేరింతలు కొట్టారు. ఈ ఎర్రని ప్రవాహాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ అని, ఉన్నఫళంగా అక్కడికి చేరాలని ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ చాలా అధిక మోతాదులో ఉంటుందని, వర్షపు నీరు రక్త వర్ణంలోకి మారడానికి కారణం ఇదేనని అంటున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రెయిన్ బో ఐలాండ్ కు వస్తుంటారని చెప్పారు.

Follow Us
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం