AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2025: హోలీని డిఫరెంట్ గా ట్రై చేస్తారా.. 5.5 కోట్ల మందిని ఆకట్టుకున్న రంగుల బెలూన్.. మీరుకూడా ఓ లుక్ వేయండి..

దేశ వ్యాప్తంగా రంగుల పండగ సందడి మొదలైంది. కాశీలో మసాన్ హోలీని జరుపుకున్నారు. మరికొన్ని గంటల్లో రంగులతో ఆడుకోవడానికి పిల్లలు పెద్దలు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో హోలీకి సంబంధించిన రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షించింది. ఇందులో ఒక జంట ప్రజలు బెలూన్ల సహాయంతో గాలిలోకి రంగులు ఊదుతూ కనిపిస్తున్నారు. దేశీ ట్రిక్ కి సంబంధించిన ఈ రీల్ 5.5 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

Holi 2025: హోలీని డిఫరెంట్ గా ట్రై చేస్తారా.. 5.5 కోట్ల మందిని ఆకట్టుకున్న రంగుల బెలూన్.. మీరుకూడా ఓ లుక్ వేయండి..
Holi Color Bomb New Trend Trick
Surya Kala
|

Updated on: Mar 13, 2025 | 4:46 PM

Share

హోలీ పండగ సందడి మొదలైంది. మరికొన్ని గంటల్లో పిల్లలు, పెద్దలు హోలీ రంగులతో ఆడుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే హోలీ జరుపుకునే రకరకాల రీల్స్ తయారు చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక జంట బెలూన్లలో రంగులను నింపి గాలిలోకి రంగులను విడిచి పెడుతూ కనిపిస్తున్నారు. హోలీ పండగ సందర్భంగా రూపొందించిన కొత్త వైరల్ వీడియో చూపరులను ఆకట్టుకుంది. దీనితో పాటు హోలీ రోజున రంగుల బుడగలను ఎలా తయారు చేయాలనేది తెలుసుకుంటున్నారు. ఈ వైరల్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అబిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఈ ఏడాది హోలీకి ముందు రంగుల బెలూన్లను పేల్చే ట్రెండ్ మొదలైంది. ఒక జంట తమ చేతుల్లో రంగులను నింపి ఉన్న రెండు బెలూన్లను పట్టుకుని ఉన్నారు. ఈ బెలూన్లతో రంగులు చల్లుకుంటున్నారు. ఈ వైరల్ రీల్ 5 కోట్ల 51 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. 8 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. వెయ్యిమందికి పైగా రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అబిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

@preetiandvijay అనే యూజర్ ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ‘ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అనే కామెంట్ ను జత చేసి పోస్ట్ చేశారు. హోలీ రోజుని డిఫరెంట్ గా జరుపుకోవాలని భావిస్తే దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ముందుగా ఏదైనా కంపెనీకి చెందిన రూ.10 విలువైన వాటర్ బాటిల్ ని తీసుకొని..దాని మూత వైపు నుంచి కొంచెం బాటిల్ ఉండేలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బెలూన్‌ను గాలితో నింపి దానిని బాటిల్ మూతకి అతికించాలి.

బెలూన్ నుంచి గాలి బయటకు రాకుండా ఉండటానికి.. బాటిల్ మూతని ముందు మీ చేతులతో దాన్ని పట్టుకోండి. తర్వాత బాటిల్ కట్ చేసిన భాగాన్ని పై నుంచి రంగుతో నింపండి. తర్వాత బెలూన్ నుంచి గాలిని మెల్లమెల్లగా విడిచి పెట్టండి. అప్పుడు బాటిల్ లో ఉన్న రంగు గాలిలో కలుస్తూ కలర్ ఫుల్ గా ఎగురుతుంది. కొంతమందికి ఈ ట్రిక్ చాలా నచ్చింది. అదే సమయంలో చాలా మందికి ఇది కష్టమైన పనిగా అనిపిస్తుందని కామెంట్ చేశారు. మరొక వినియోగదారుడు వాక్యూమ్ క్లీనర్‌ను రివర్స్‌లో అమలు చేస్తే.. ఇదే ఫలితం వస్తుందని కామెంట్ చేశారు.

बहुत बढ़िया ट्रिक है…

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..