Vijayashanti: 30 ఏళ్లకు పైగా సినీ కెరీర్.. రాజకీయ నేత.. కనీసం సొంత కారు లేని రాములమ్మ..
తెలుగులో స్టార్ హీరోయిన్ గా.. ఇంకా చెప్పాలంటే హీరోలతో సమానంగా ఫేం ని సొంతం చేసుకున్న విజయశాంతి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో విజయశాంతి తన స్థిరచరాస్తులను తనపై ఉన్న కేసులను గురించి అఫిడవిట్లలో వెల్లడించారు. అయితే ఈ సమయంలో కోట్ల ఆస్తులున్న రాములమ్మకి సొంతంగా కారు లేదట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సమయంలో విజయశాంతి దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోట్లు ఆస్తులున్న విజయశాంతికి సొంత కారు లేదని డాక్యుమెంటేషన్‌లో పెర్కొండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే స్టార్ యాక్టర్స్ అంటే లగ్జరీ కార్లు గుర్తుకొస్తాయి. మరి స్టార్ హీరోయిన్ గా దాదాపు 30 ఏళ్ళు సినీ కెరీర్ లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయశాంతి లేడీ అమితాబ్ గా, లేడీ సూపర్ స్టార్ గా ఖ్యతిగాంచారు. సినీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే రాజకీయాల్లో అడుగు పెట్టి.. తెలంగాణ తల్లి అనే పార్టీని స్థాపించి తర్వాత తన పార్టీని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ లో పని చేసిన విజయశాంతి 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్ గూటికి చేరింది. ఇప్పుడు చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు.
సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు అయిన విజయశాంతి 30 సంవత్సరాల సినీ కెరీర్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషా చిత్రాలలో సుమారు 180 సినిమాల్లో నటించారు. కర్తవ్యం సినిమాలో విజయశాంతి నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సీనియ నటి , రాజకీయ నేత దగ్గర కనీసం కారు కూడా లేదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. విజయశాంతి , శ్రీనివాస్ ప్రసాద్ దంపతుల దగ్గర ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ రూ. 115 కోట్లు.
స్థిరచరాస్తుల విలువ ఎంత అంటే
హైదరాబాద్, చెన్నై లో ఉన్న భూముల గురించి తెలుపుతూ.. విజయశాంతి పేరు మీద 67.5 కోట్ల విలువ చేసే భూములున్నాని.. తన శ్రీనివాస్ ప్రసాద్ పేరు మీద రూ. 45 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఈ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు మీద బ్యాంక్‌లో కోటి రూపాయలు డిపాజిట్ ఉన్నట్లు 2 కిలోల బంగారు నగలు ఉన్నాయని.. వాటి విలువ సుమారు కోటీ 98 లక్షలు ఉంటుందని వెల్లడించారు. తన దగ్గర నగదు 5 లక్షల 92 వేలు ఉన్నాయని.. తన శ్రీనివాస్ ప్రసాద్ దగ్గర 30 వేల నగదు ఉన్నాయని పేర్కొన్నారు.
కేసులు ఎన్ని ఉన్నాయంటే
విజయ శాంతి తన పేరున ఉన్న క్రిమినల్ రికార్డ్‌ను సైతం వెల్లడించారు. హనుమకొండ, సంగారెడ్డిలో రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. అయితే కనీస జీతగాడు కూడా కారులో తిరుగుతున్న ఈ రోజుల్లో కోట్ల ఆస్తులున్న విజయశాంతికి కనీసం సొంత కారు కూడా లేకవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..