AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2025: హోలీ రోజున బాల గోపాలుడికి ఈ వస్తువులను సమర్పించండి.. కోరిన కోర్కెలు నెరవేరుతాయి

ఇంట్లో ఎక్కువ మంది శ్రీకృష్ణుడిని బాలుడి రూపంలో లడ్డూ గోపాలుడిగా కొలుస్తారు. బాల స్వరూపమైన లడ్డూ గోపాల్‌ను తమ ఇళ్లలో ఉంచుకుంటారు. ఈ బాల గోపాలుడిని పండగలు, పర్వదినాల సమయంలో అందంగా అలంకరించడంతో పాటు, వివిధ రకాల నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. కృష్ణాష్టమికి మాత్రమే కాదు హోలీ రోజున కూడా లడ్డూ గోపాలుడికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పిస్తారు. ఇలా చేయడం వలన బాల గోపాలుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం.

Holi 2025: హోలీ రోజున బాల గోపాలుడికి ఈ వస్తువులను సమర్పించండి.. కోరిన కోర్కెలు నెరవేరుతాయి
Holi 2025
Surya Kala
|

Updated on: Mar 13, 2025 | 3:33 PM

Share

శ్రీకృష్ణుడిని బాల గోపాలుడిగా ( లడ్డూ గోపాలుడిగా) ఎక్కువ మంది ఇంట్లో పుజిస్తారు. కొంతమంది భక్తులు ఆయనను రోజూ పూజిస్తారు. కన్నయ్యను చిన్న పిల్లవాడిలా భావించి సేవ చేస్తారు. ప్రతిరోజూ బాల గోపాలుడికి స్నానం, అలంకరణ, విశ్రాంతి, వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కొన్ని ప్రత్యెక సందర్భాల్లో , పండగలలో లడ్డూ గోపాలుడికి కొన్ని ప్రత్యేక వస్తువులను కూడా సమర్పిస్తారు. బాల గోపాలుడికి నిర్మలమైన భక్తితో సేవ చేసే ఏ భక్తుడైనా కోరిన కోర్కె నెరవేరుతుంది అని నమ్ముతారు. కనుక హోలీ రోజున బాల గోపాలుడి ఆశీర్వాదం పొందడానికి ఏ వస్తువులను సమర్పించాలో తెలుసుకుందాం.

లడ్డూ గోపాల్ కు ఈ వస్తువులు సమర్పించండి

హోలీ రోజున సాంప్రదాయ స్వీట్స్ చాలా ముఖ్యమైనదివిగా పరిగణించబడుతున్నాయి. హోలీ సందర్భంగా ఈ రకరకాల స్వీట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీ ఇంట్లో ఉన్న బాల గోపాలుడికి మీ ఇంట్లో రెడీ చేసిన స్వీట్స్ ను నైవేద్యంగా సమర్పించండి.

పెరుగుతో తయారు చేసిన వంటకాలు

ఫాల్గుణ మాసంలో బాల గోపాలుడికి పెరుగుతో చేసిన వంటకాలను నైవేద్యంగా పెడతారు. అటువంటి పరిస్థితిలో హోలీ రోజున మీరు లడ్డూ గోపాల్ కు తీపి పెరుగు లేదా పెరుగుతో చేసిన వంటకాలను సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో, సంబంధాలలో మాధుర్యం నిలిచి ఉంటుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

జిలేబీ

హోలీ రోజున బాల గోపాలుడికి జలేబీని కూడా సమర్పించవచ్చు. హోలీ రోజున ఈ జలేబీని కన్నయ్యకు సమర్పించడం శుభప్రదమని నమ్మకం. ఇలా చేయడం ద్వారా కన్నయ్య ఆశీస్సులు లభిస్తాయని అంటారు. అలాగే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి.

వెన్న

నంద నందనుడికి వెన్న అంటే ఇష్టం.. కనుక బాల గోపాలుడికి ఇంట్లో పూజలో పూలు, పండ్లు, మిఠాయిలు, తులసి దళాలతో పాటు వెన్నని కూడా సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..