Lion In Dreams: కలలో ఈ జంతువును చూడటం చాలా శుభప్రదం.. జీవితంలో అంతులేని ఆనందం మీ సొంతం అర్ధం..
కలలు ఒక వ్యక్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకి ఏదో ఒక అర్థం ఉంటుంది. చాలా సార్లు ఒక వ్యక్తి తన కలలో వివిధ రకాల జంతువులు, పక్షులను, వస్తువులను చూస్తాడు. కలలో జంతువులు కనిపించడం భవిష్యత్ లో జరగనున్న శుభాలకు లేదా అశుభాలకు సంకేతాలు. అయితే మీ కలలో అడవిలో రాజు.. మృగ రాజు కనుక కనిపిస్తే.. మీ జీవితంలో ఆనందం రాబోతోందని అర్థం చేసుకోవాలి.

ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు కలలు కంటాడు. కొన్నిసార్లు కలలో మంచి సంఘటనలు కనిపిస్తాయి. మరి కొన్నిసార్లు అతనికి భయంకరమైన కలలు వస్తాయి. కలలు జీవితానికి సంబంధించిన అనేక సూచనలను ఇస్తాయి. ప్రతి కల వెనుక ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఏదో ఒక సందేశం దాగి ఉంటుందని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. కొన్ని కలలకు చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. అయితే సర్వసాధారణంగా కలలో జంతువులు కనిపిస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో జంతువును చూడడం అంటే అది భవిష్యత్ లో జరగనున్న మంచి చెడులకు సంకేతాలు. ఈ రోజు మన కలలో సింహం కనిపిస్తే ఆ కలకు అర్థం ఏమిటో తెలుసుకుందాం.
శక్తి పెరుగుదలకు సంకేతం
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో సింహాన్ని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సింహం అడవికి రాజు. ఎవరి కలలోనైనా సింహం కనిపిస్తే ఆ వ్యక్తికి శక్తి బాగా పెరుగుతుందనడానికి అది సంకేతం. అంతేకాదు ఉద్యోగస్తులు అయితే ఆఫీసులో ప్రమోషన్ లభించవచ్చు అని అర్ధమట.
శత్రువులపై విజయానికి సంకేతం
సింహాన్ని బలం, ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. ఎవరి కలలో అయినా సింహం కనిపిస్తే ఆ కలకు అర్ధం.. ఆ వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించబోతున్నాడని కూడా సూచిస్తుంది.
ప్రేమలో విజయానికి సంకేతం.
స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన కలలో సింహాన్ని లేదా జంట సింహాలను, సింహరాశిని చూసినట్లయితే.. ఈ కలకు అర్ధం అతని వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందట. అంతేకాదు కలలో సింహం, జంట సింహాలు కనిపిస్తే తాము ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచుతారని.. ప్రేమలో విజయాన్ని సొంతం చేసుకుంటారని అర్ధమట.
ఉద్యోగంలో మార్పుకి సంకేతాలు
ఎవరైనా కలలో సింహం పిల్లను చూసినట్లయితే.. త్వరలో వీరి ఉద్యోగంలో మార్పు వస్తుందని అర్థం. ఇది మాత్రమే కాదు కలలో సింహం పిల్ల కనిపించడం కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని ముందుగా సూచిస్తుందట.
సమస్యలను సులభంగా ఎదుర్కోండి
జ్యోతిషశాస్త్రంలోని 12 రాశుల్లో సింహరాశి ఒకటి. దీంతో సింహ రాశికి చెందిన వారి కలలో సింహం కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని అర్థం వీరి జీవితంలో శక్తి పెరుగుతోంది. అలాగే రాబోయే కాలంలో సింహ రాశి వారికి ఎదురయ్యే అత్యంత కఠినమైన సమస్యలను కూడా చాలా సులభంగా ఎదుర్కొంటారని ముందస్తు సూచన.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు