AP Weather: ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఏపీలో వాతావరణం చిత్రవిచిత్రంగా ఉంది. మొన్న రెండు రోజులు కొన్ని చోట్ల వర్షాలు పడగా.. ఇప్పుడు మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. అసలు వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతోంది.. ఈ వార్తలో ఇప్పుడు తెలుసుకుందామా మరి.! ఆ వివరాలు ఇలా

బుధవారం పశ్చిమ భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న మాల్దీవులు ప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు తీర నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ఇప్పుడు పశ్చిమ భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం.. దానికి ఆనుకుని ఉన్న మాల్దీవుల మీదుగా దక్షిణ కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
—————————————-
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రాయలసీమ:-