పరీక్షల్లో ఈజీగా పాస్ కావాలా.. జపనీస్ టెక్నీస్ ఫాలో అవ్వాల్సిందే!

samatha 

13 march 2025

Credit: Instagram

 పరీక్షలు వస్తున్నాయంటే చాలు మన వారు చాలా భయపడి పోతుంటారు. ఎక్జామ్స్ అప్పుడే తినడం కూడా మానేసి కష్టపడి చదువుతుంటారు.

దీంతో ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా మెంటల్‌గా కూడా చాలా డిస్ట్రాబ్ అవుతుంటారు. అయితే ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎక్జామ్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జపానీస్ వారు పిల్లలు పరీక్షల సమయంలో ఎలాంటి స్ట్రెస్ లేకుండా, చదువకుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను ఫాలో అవుతారు. అవి :

కైజన్ పద్ధతి.. అంటే నిరంతర పఠనం. పరీక్షల ముందే కాకుండా ప్రతి రోజూ కొంచెం కొచెం చదవడం వలన ఎక్జామ్స్ టైమ్‌లో మనపై భారం పడదు.

షు-హ-రి పద్ధతి, అంటే షు ప్రాథమిక అంశాలను నేర్చుకోవడం, హా, దాని నుంచి జ్ఞానాన్ని సంపాదించడం, రి మరింత లోతుగా దానిని అర్థం చేసుకోవడం

పోమోడోర్ టెక్నిక్ అంటే, వారు 25 నిమిషాలు చదువుకొని, 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు. దీని వలన మైండ్ ఫ్రెష్‌గా ఉంటుందంట.

మనం రాసుకునే ఆన్సర్స్ అర్థం కాకుండా, గజిబిజిగా ఉండకూడదు. ఇలా ఉన్నట్లైతే చదవడం కష్టం అవుతుంది.అందుకే మీ నోట్స్ ఇప్పుడు క్లియర్‌గా ఉండాలి

పదే పదే చదవడం కాకుండా కాసేపు చదవిని వాటిని తమకు తామే గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించాలి. ఇలా అయితే జ్ఞాపక శక్తి పెరుగుతుందంట.