అపరకుభేరుడు అంబానీ భార్య నీతా అంబానీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఆరుపదుల వయసులోనూ చాలా యంగ్‌గా కనిపిస్తుంటుంది.
తాజాగా నీతా అంబానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రీలీజ్ చేసిన ఓ వీడియోలో ఈమె 61 వయసులో కూడా అంత ఫిట్‌గా ఉండటానికి గల రహస్యాన్ని తెలిపింది.
ఆమె మాట్లాడుతూ..శరీరం మనసు, ఆరోగ్యంగా ఉంచుకునే మంచి వాతావరణాన్ని మనమే కల్పించుకోవాలని ఆమె తెలిపింది.
ముఖ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి అనే విషయాలను నీతా అంబానీ తన వీడియో ద్వారా వివరించింది.
నీతా అంబానీ శారీరక, మానసిక, ఆరోగ్యం కోసం భరతనాట్యం, యోగా చేస్తుందంట. ఎందుకంటే అది, మొత్తం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుందని వారు తెలిపారు.
లెగ్ ప్రెస్ వ్యాయామం నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా వారానికి 5 రోజులు వ్యాయామం చేయడం వలన మన శరీరాన్ని మనం ఫిట్‌గా ఉంచుకోవచ్చని తెలిపారు.
అలాగే మహిళలు, ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు అయినా వ్యామాయానికి కేటాయించాలని, వీలైతే 60 నిమిషాలు కూడా పర్వాలేదని తెలిపింది.
అదే విధంగా తాను పూర్తి శాఖాహారి అని ముఖ్యంగా తాను షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలే తీసుకోను అని చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా ఆహారంలో అధిక మొత్తంలో ప్రొటీన్ ఉండే, సేంద్రీయ ఫుడ్ తీసుకుంటాను.ఎందుకంటే ఇవి కండరాలను బలపరుస్తాయ, శరీరాన్ని కూడా చురుగ్గా ఉంచుతాయని ఆమె పేర్కొంది.