చాణక్యనీతి : తల్లిదండ్రులు ఇలా చేస్తే.. పిల్లలకు శత్రువులుగా మారడం ఖాయం!

samatha 

10 march 2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను తెలియజేశారు. ఆయన తన నీతి పుస్తకంలోని అనేక విషయాలు ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి.

అయితే ఆ చార్య చాణక్యుడి ప్రకారం తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లే తమ పిల్లలకు వారిని శత్రువులను చేస్తాయంట. అవి ఏవి అంటే?

చాణక్యుడి ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా కొన్ని విషయాలను నేర్పించాలంట. లేకపోతే వారు తమ పిల్లలకుు శత్రువులైపోతారు.

చిన్నప్పటి నుంచే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన ప్రవర్తన నేర్పించాలి. అలాగే అందరినీ గౌరవించడం నేర్పించాలి. లేకపోతే ఇది మీ పిల్లల జీవితంపై చాలా ప్రభావం చూపుతోంది.

అలాగే పిల్లలను సోమరులుగా అస్సలే చేయకూడదు. పిల్లలను సోమరిగా చేస్తే, పిల్లవాడికి తల్లిదండ్రులే శత్రువులా కనిపిస్తారు. దీని వలన పిల్లల జీవితం నాశనం అవుతుందంట.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలంట. మంచి విద్య అందించినప్పుడే వారు జీవితంలో గొప్పస్థాయికి ఎదుగుతారు.

చాణక్యుడు ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకు నిజాయితీగా ఉండటం నేర్పించాలని తెలిపాడు. నిజాయితీ మంచి విలువలు ఉన్నప్పుడే మీ పిల్లలు సరైన మార్గంలో వెళ్తారు.

అంతే కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బు విలువ తెలియజేయాలని, లేకపోతే వారు ఎదిగే కొద్దీ ఎక్కువ ఖర్చుచేస్తారు. పైవాటిలో ఏదీ సరిగ్గా మీరు నేర్పించకపోయినా వారికి మీరు శత్రువులేనంట.