Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Dravid: కాలికి గాయమైనా.. జట్టు కోసం రాహుల్‌ ద్రవిడ్‌ చూడండి ఏం చేశారో! హ్యాట్సాఫ్ ది వాల్‌

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తీవ్ర గాయంతో బాధపడుతున్నప్పటికీ, జట్టుకు శిక్షణ ఇవ్వడానికి ఊత కర్రల సాయంతో వచ్చారు. ఆయన అంకితభావం, నిబద్ధత క్రికెట్ అభిమానులను ఆకర్షించింది. ఈ ఘట్టం ద్రావిడ్‌ క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను మరోసారి చాటి చెబుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

Rahul Dravid: కాలికి గాయమైనా.. జట్టు కోసం రాహుల్‌ ద్రవిడ్‌ చూడండి ఏం చేశారో! హ్యాట్సాఫ్ ది వాల్‌
Rahul Dravid
Follow us
SN Pasha

|

Updated on: Mar 13, 2025 | 9:18 PM

రాహుల్‌ ద్రావిడ్‌.. ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో చిరస్మరణీయమైన పేరు. ఓ ఆటగాడిగా, ఓ కెప్టెన్‌గా, ఆ తర్వాత టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా.. ఆయన సేవలు భారత క్రికెట్‌ను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి. భారత్‌కు 2024లో టీమిండియా వరల్డ్‌ కప్‌ అందించిన తర్వాత ద్రావిడ్‌ తన హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు కోచ్‌గా వెళ్లారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ సాహసోపేతమైన పని మరోసారి క్రికెట్ అభిమానుల మనసును దోచుకునేలా చేసింది. దాంతో క్రికెట్‌పై ఆయన ప్రేమ, నిబద్ధత, అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

ఆయన కాలికి పెద్ద గాయమైన కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా.. మైదానంలోకి దిగి రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చారు. ఇటీవలె క్రికెట్ ఆడుతుంటే ద్రావిడ్‌ కాలికి పెద్ద గాయమైంది. ఎడమ కాలికి దెబ్బ తాకింది. దీంతో ఆ కాలికి పెద్ద కట్టు కట్టారు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ దగ్గర పడుతోన్న తరుణంలో ఆయనే దగ్గరుండి జట్టుతో ప్రాక్టీస్‌ చేయించేందుకు రంగంలోకి దిగారు. తన గాయం వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో ట్రైనింగ్ క్యాంపులో చేరారు.

సరిగా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. ఊతకర్రల సాయంతో రాహుల్‌ జైపూర్‌లోని ట్రైనింగ్ క్యాంప్‌నకు వచ్చారు. తాను ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి కోచ్‌ను ఇంకెక్కడా చూడలేం. రాహుల్ కు గాయమవ్వడం బాధాకరమైన విషయం’ అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. ఇలాంటి కోచ్‌ ఉంటే జట్టుకు విజయం పక్కా, ఇలాంటి కోచ్‌ దొరకడం అదృష్టం అంటూ ద్రవిడ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..
త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..
గవర్నమెంట్ వాహనంలో బంగారం సరఫరా చేసిన రన్య రావు..
గవర్నమెంట్ వాహనంలో బంగారం సరఫరా చేసిన రన్య రావు..
కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇంత దారుణమా..!
ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇంత దారుణమా..!
యూవీకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన క్రికెట్ గాడ్
యూవీకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన క్రికెట్ గాడ్
కాల్ సెంటర్‎లో పని.. స్టార్ హీరోతో తొలి సినిమా.. ఎవరా బ్యూటీ.?
కాల్ సెంటర్‎లో పని.. స్టార్ హీరోతో తొలి సినిమా.. ఎవరా బ్యూటీ.?
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ అంతే..
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ అంతే..
ఇంట్లో శివలింగం ప్రతిష్టించానుకుంటున్నారా ఈ జాగ్రత్తలు తప్పని సరి
ఇంట్లో శివలింగం ప్రతిష్టించానుకుంటున్నారా ఈ జాగ్రత్తలు తప్పని సరి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్
పీఎస్‌ఎల్ కంటే డబ్ల్యూపీఎల్ విజేతపైనే కోట్ల వర్షం.. ఎంత ఎక్కువంటే
పీఎస్‌ఎల్ కంటే డబ్ల్యూపీఎల్ విజేతపైనే కోట్ల వర్షం.. ఎంత ఎక్కువంటే