Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే.. మీ మాటల్లో ఈ చిన్నచిన్న మార్పులు చేస్తేసరి!

అందరికీ నచ్చినట్లు ఉండటం దాదాపు అసాధ్యం. అలాగే అందరి మనసులను గెలుచుకోవడం కూడా అంత సులభం కాదు. కొంతమందికి మనం నచ్చవచ్చు, మరికొందరికి మనం నచ్చకపోవచ్చు. కానీ మనల్ని అందరూ ఇష్టపడాలని, మన చుట్టూ చాలా మంది ఉండాలని, మనతో హాయిగా నవ్వుతూ మాట్లాడాలని అందరూ కోరుకుంటారు..

అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే.. మీ మాటల్లో ఈ చిన్నచిన్న మార్పులు చేస్తేసరి!
Good Conversations
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 13, 2025 | 9:18 PM

అందరి మనసులను గెలుచుకోవడం అంత సులభం కాదు. కొంతమందికి మనం నచ్చవచ్చు, మరికొందరికి మనం నచ్చకపోవచ్చు. కానీ మనల్ని అందరూ ఇష్టపడాలని, మన చుట్టూ చాలా మంది ఉండాలని, మనతో హాయిగా నవ్వుతూ మాట్లాడాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి మన చుట్టూ ఉన్న వ్యక్తులకు మనల్ని మనం నిజంగా నచ్చేలా చేసుకోవడం కూడా ఒక కళ. ఇందుకు చాణక్యుడు కొన్ని సూక్ష్మమైన అంశాలను తెలిపాడు. ఈ లక్షణాలను కలిగి ఉన్నవారు మాత్రమే అందరినీ తమ వైపు ఆకర్షిస్తారని అంటున్నాడు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మంచి సంభాషణ

ఆహ్లాదకరమైన, మృదువైన మాటలు వినడానికి ఎవరు ఇష్టపడరు? బాగా సంభాషించే వ్యక్తిని అందరూ ఇష్టపడతారు. కాబట్టి అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాలంటే ప్రభావవంతమైన కమ్యూనికేషన్ అవసరమని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. అందువల్ల మన ఆలోచనలను స్పష్టంగా, ప్రభావవంతంగా తెలియజేయడానికి కమ్యూనికేషన్ ముఖ్యం. స్పష్టమైన పదాలు అపార్థాలను నివారించడానికి సహాయపడతాయి.

నాయకత్వం వహించాలి

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా.. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండటం ముఖ్యం. నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మీరు ఇలా చేస్తే, మీరు అందరి గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి, మీలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం అవసరం. ఇలా చేస్తే అందరికీ దగ్గరగా ఉంటారని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి

ఈ రోజుల్లో నిజాయితీపరులైన వ్యక్తులను కనుగొనడం చాలా కష్టం. వంద మందిలో కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే నిజాయితీపరులు ఉంటారు. నిజానికి, నిజాయితీ ఏ సంబంధానికైనా పునాది. కాబట్టి, ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా వ్యవహరించాలి. ఇది బంధంలో నమ్మకాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది.

వినయంగా ఉండలి

ప్రతి ఒక్కరికీ ఉండవలసిన మొదటి లక్షణం వినయం అని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. వినయపూర్వకమైన వ్యక్తులు అందరితో త్వరగా కలిసిపోతారు. ఈ గుణం ఉన్నవారు ఇతరులు చెప్పేది శ్రద్ధగా వింటారు. తన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. సహజంగానే, ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తులను ఇష్టపడతారు.

కరుణ చూపాలి

అందరికీ నచ్చాలంటే, తమ చుట్టూ ఉన్న వారితో ప్రేమ, దయ, కరుణ చూపాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఎదుటివారి సమస్యలను, ఆందోళనలను అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే అందరికీ నచ్చుతారు. సహాయం చేయడం, మద్దతు అందించడం ద్వారా సంబంధాలు బలపడతాయి. ఈ విధంగా చేస్తే సన్నిహిత వర్గాలలోని ప్రతి ఒక్కరికీ నచ్చే వ్యక్తిగా మీరు మారతారని చాణక్యుడు చెప్పాడు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.