- Telugu News Photo Gallery If you want to sleep comfortably all night long, you need to avoid these habits.
రాత్రంతా హాయిగా నిద్రపోవాలంటే.. ఈ అలవాట్లును దూరం పెట్టాల్సిందే..
సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో మన శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో మనలో కొత్త ఉత్సాహం నిండుతుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా మనం చేసే పనిమీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు ఇలా చాలా అంశాలు నిద్రను దూరం చేస్తున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పడుకోగానే నిమిషాల్లో నిద్ర వస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
Updated on: Aug 23, 2025 | 1:32 PM

రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకే రకమైన పనులు అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, మంచి మ్యూజిక్ వినటం వంటివి చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. దీనివల్ల హాయిగా నిద్రపోతారు. అలాగే ఆరోగ్యం ఉంటారు. మంచి నిద్ర కారణం చురుగ్గా పని చేస్తారు. అయితే పాడుకొనే ముందు కొన్ని అలవాట్లు ఉంటే నిద్ర చెడిపోతుంది.

నిద్రకు ముందు టీవీ, కంప్యూటర్ మొబైల్ ఫోన్ వాడితే నష్టం కలుగుతుంది. పడుకునే ముందు మొబైల్ ఫోన్‌ను దూరంగా పెట్టుకోవటం మంచిది. ఫోన్ వాడితే.. ఇది మీ నిద్రను చెడగొడుతుంది. అందువల్ల రాత్రంతా మంచి నిద్ర కావాలంటే పడుకునే సమయంలో ఫోన్ చూడటం మానేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దీంతో రాత్రి నిద్రపోవడానికి కొన్ని గంటలు ముందు మొబైల్ తోనే గడుపుతున్నారు. దీంతో మొబైల్‌ను పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గది వాతావరణంమీ పడక గది వాతావరణం కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. గది మరీ చల్లగా, వేడిగా లేకుండా ఉండాలి. వేడిగా ఉన్నా లేక చల్లగా ఉన్నా నిద్ర సరిగా పట్టదు. అలాగే, బెడ్‌రూమ్ ఎంత నిశబ్ధంగా ఉంటే అంత మంచి నిద్ర వస్తుంది. కాబట్టి గది నిశబ్ధంగా ఉండేలా చూసుకోండి ఎటువంటి సౌండ్స్ మీ నిద్రకు ఆటంకం కలిగించకుండా ఉండాలి.

అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. విటమిన్ లోపాలు కూడా అతిగా నిద్రపోవడానికి కారణమవుతాయి. విటమిన్ బి12 శక్తికి అతిపెద్ద వనరు. ఇది ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. దీని లోపం అలసట, అధిక నిద్రకు కారణమవుతుంది.




