- Telugu News Photo Gallery If you take jaggery and peanuts together every day, those problems will not arise.
Jaggery with Chana Benefits: రోజు శనగలతో బెల్లం కలిపి తీసుకోండి చాలు.. ఆ సమస్యలు దరిచేరవు..
మన శరీరం బలంగా ఉండాలంటే ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, మినరల్స్ ఉన్న ఆహారం తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే బెల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయ్. శెనగలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.శనగల్లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శనగలు, బెల్లం కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 07, 2025 | 2:46 PM

జీవక్రియను పెరుగుతుంది: ప్రతిరోజూ ఉదయం శనగలు, బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా మారుతాయి. వ్యాయాయం చేసే వారు, జిమ్ కు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గుతారు: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు అధికబరువు , ఊబకాయం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి శనగలు, బెల్లం దివ్యౌషధం లాంటివి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. ప్రతిరోజూ 100గ్రాముల శనగలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి 19 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.

ఎసిడిటిని దూరం చేస్తుంది: ప్రస్తుత కాలంలో చాలామంది ఎసిడిటి సమస్యతో భాదపడుతున్నారు. ఎసిడిటి సమస్యను తగ్గించాలంటే బెల్లం, శనగలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి మీ జీర్ణశక్తిని బలంగా ఉంచుతాయి. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తాయి.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది: వీటిని డైట్ లో చేర్చుకుంటే జ్ఞాపకశక్తికి పెరుగుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను మెరుగుపరుస్తుంది. దీంతో మీ మెదడు పనితీరు బాగా పెరుగుతుంది. అంతేకాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది.

దృఢమైన దంతాల కోసం: శనగలు , బెల్లం కలిపి తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. వీటిలో ఉండే భాస్వరం దంతాలను బలపరుస్తుంది. 10 గ్రాముల బెల్లం 4 మిల్లీగ్రాముల భాస్వరం, 100గ్రాములకు 168 మిల్లీగ్రాముల లభిస్తుంది.

గుండె జబ్బులను నయం చేస్తాయి: గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో శనగలు, బెల్లం ఎంతగానో సహాయపడతాయి. అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడతాయి. శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

రక్తహీనత దూరమవుతుంది: రక్తం రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే శెనగలు, బెల్లం కలిపి తినవచ్చు. ఈ రెండూ ఐరన్ పుష్కలంగా ఉన్న కారణంగా రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలను పెంచి శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది.




