- Telugu News Photo Gallery If you drink these teas, the cold will subside quickly, check here is details in Telugu
Teas for Cold: ఈ టీలు తాగితే జలుబు క్షణాల్లో మాయం అవుతుంది.. మీరూ ట్రై చేయండి!
వాతావరణం మారినప్పుడల్లా లేదా చల్లని కూల్ డ్రింక్స్, వాటర్, ఐస్ క్రీములు ఇలాంటి ఆహార పదార్థాలు తిన్నా, శరీరంలో వేడి ఎక్కువైనా జలుబు చేస్తుంది. జలుబు చేసిందంటే.. ఆ తర్వాత తలనొప్పి, దగ్గు, జ్వరం కూడా రావచ్చు. జలుబు వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. ఓ నాలుగు లేదా ఐదు రోజుల పాటు ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఈ జలుబు ఒక్కోసారి తగ్గదు. కానీ ఈ టీలు తాగితే జలుబు నుంచి త్వరగా..
Updated on: Mar 29, 2024 | 1:54 PM

వాతావరణం మారినప్పుడల్లా లేదా చల్లని కూల్ డ్రింక్స్, వాటర్, ఐస్ క్రీములు ఇలాంటి ఆహార పదార్థాలు తిన్నా, శరీరంలో వేడి ఎక్కువైనా జలుబు చేస్తుంది. జలుబు చేసిందంటే.. ఆ తర్వాత తలనొప్పి, దగ్గు, జ్వరం కూడా రావచ్చు. జలుబు వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు.

ఓ నాలుగు లేదా ఐదు రోజుల పాటు ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఈ జలుబు ఒక్కోసారి తగ్గదు. కానీ ఈ టీలు తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసిలో అద్భుతమైన ఔషధాలు ఉంటాయి. తులిసి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి, వడకట్టి, తేనె కలుపుకుని తాగాలి. అలాగే అల్లం టీ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

అలాగే మిరియాల టీతో కూడా ఉపశమనం పొందవచ్చు. జలుబు త్వరగా తగ్గాలంటే పసుపు పాలు, మిరియాల పాలు తాగినా త్వరగా రిలీఫ్ పొందుతారు. అదే విధంగా రాత్రి పడుకునే ముందు.. ఒక స్పూన్ కొబ్బరిన నూనె నోట్లో వేసుకుని మింగండి. ఇలా చేస్తే కోల్డ్ తగ్గుతుంది.

వేడి నీటిలో పుదీనా ఆకులు, యూకలిప్టిస్ ఆకులు, కొబ్బరి నూనె వేసి బాగా ఆవిరి పట్టండి. జలుబు చేసినప్పుడు రోజూ ఒక స్పూన్ తేనె తీసుకుంటే.. రిలీఫ్ నెస్ పొందవచ్చు. అలాగే శరీరానికి వేడి చేసే ఆహారాలు తీసుకోవాలి.




