- Telugu News Photo Gallery If you bathe your head with geyser water, will your hair fall off? check here is details
Health Care Tips: గీజర్ వాటర్ తో తల స్నానం చేస్తే హెయిర్ ఊడి పోతుందా!
గీజర్లు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కామన్ గా ఉంటున్నాయి. నీటిని వేడి చేసుకోవడానికి గ్యాస్, పొయ్యి వంటివి కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా గీజర్లు పెడుతున్నారు. వీటి వాడకం ఇప్పుడు బాగా పెరిగింది. ప్రత్యేకంగా కాచే పని లేకుండా.. తీసుకెళ్లకుండా నేరుగా ఇప్పుడు బాత్ రూమ్స్ లోనే వేడి నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కరెంట్ ద్వారా హీట్ ఎక్కిన వాటర్ స్నానం చేయడం వల్ల పలు రకాల దుష్ఫ్రభావాలు ఉన్నాయా? ఈ వాటర్ తో హెడ్ బాత్ చేస్తే జుట్టు రాలి పోతుందా? అనే పలు రకాల అనుమానాలు..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Nov 30, 2023 | 7:24 PM

గీజర్లు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కామన్ గా ఉంటున్నాయి. నీటిని వేడి చేసుకోవడానికి గ్యాస్, పొయ్యి వంటివి కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా గీజర్లు పెడుతున్నారు. వీటి వాడకం ఇప్పుడు బాగా పెరిగింది. ప్రత్యేకంగా కాచే పని లేకుండా.. తీసుకెళ్లకుండా నేరుగా ఇప్పుడు బాత్ రూమ్స్ లోనే వేడి నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే కరెంట్ ద్వారా హీట్ ఎక్కిన వాటర్ స్నానం చేయడం వల్ల పలు రకాల దుష్ఫ్రభావాలు ఉన్నాయా? ఈ వాటర్ తో హెడ్ బాత్ చేస్తే జుట్టు రాలి పోతుందా? అనే పలు రకాల అనుమానలు చాలా మందిలో ఉంటాయి. మరి వీటిల్లో నిజమెంత? అలాగే అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

గీజర్ వాటర్ అనేది కరెంట్ తో వేడెక్కుతాయి. నీరు వేడెక్కడం వల్ల సూక్ష్మ జీవులు, వైరస్ లు, బ్యాక్టీరియా వంటివి ఏమైనా ఉంటే నశించి పోతాయి. దీంతో ఈ నీరు సురక్షితంగా ఉంటాయి. కానీ గుర్తించు కోవాల్సిన విషయం ఏంటంటే.. మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు. కేవలం గోరు వెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలి.

అలాగే గీజర్ వాటర్ తో తల స్నానం చేసేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గీజర్ వాటర్ తో హెడ్ బాత్ చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. కొందరి శరీర తత్వం బట్టి ఇది మారుతుంది. గీజర్ వాటర్ తో స్నానం చేసేటప్పుడు జుట్టు రాలుతున్నట్టు మీకు అనిపిస్తే.. అది పడటం లేదని అర్థం చేసుకోవాలి.

కానీ గీజర్ వాటర్ తో స్నానం చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. వేడి వేడి నీటితో హెడ్ బాత్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లలో ఉండే సహజమైన నూనెలు పోతాయి. జుట్టు కూడా పొడి బారి పోతుంది. అందుకే మరీ వేడిగా ఉన్న వాటర్ తో కాకుండా.. గోరు వెచ్చగా ఉన్న నీటితో తల స్నానం చేయాలి.





























