Pet Care Tips: మీ పెట్ డాగ్‌తో వర్షంలో బయటికి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

మనలో చాలా మందికి పెంపుడు జంతువులంటే అమితమైన ఇష్టం. వాటికి చక్కని పేర్లు పెట్టి ఇంట్లో మనుషుల్లా చూస్తుంటారు. ఆహారం విషయంలో, ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాం. పెంపుడు జంతువులు కూడా వయసు పెరిగాక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. క్యాన్సర్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌, కీళ్లనొప్పులు, కీళ్ల వ్యాధులు, గుండె జబ్బులు, డిమెన్షియా, డయాబెటిస్‌ వంటి సమస్యలు వస్తుంటాయట...

Pet Care Tips: మీ పెట్ డాగ్‌తో వర్షంలో బయటికి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
Pet Care Tips
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 14, 2024 | 1:42 PM

మనలో చాలా మందికి పెంపుడు జంతువులంటే అమితమైన ఇష్టం. వాటికి చక్కని పేర్లు పెట్టి ఇంట్లో మనుషుల్లా చూస్తుంటారు. ఆహారం విషయంలో, ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాం. పెంపుడు జంతువులు కూడా వయసు పెరిగాక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. క్యాన్సర్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌, కీళ్లనొప్పులు, కీళ్ల వ్యాధులు, గుండె జబ్బులు, డిమెన్షియా, డయాబెటిస్‌ వంటి సమస్యలు వస్తుంటాయట. కుక్కలను ఎంత ప్రేమగా పెంచినా.. వాటి శారీరక, మానసిక స్థితి వల్ల కరవడానికీ వెనుకాడవు. ఇటీవల కాలంలో పెంపుడు కుక్కలు కూడా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జంతు ప్రేమికులు తమ పెడ్‌ డాగ్స్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. వర్షాకాలంలో పెంపుడు జంతువుల ఆరోగ్యంపై అధిక శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈ కాలంలో మనుషుల్లాగే పెంపుడు జంతువులు కూడా అధికంంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలంలో మీ పెట్‌ డాగ్‌ను తీసుకుని బయటకు వాకింగ్‌కు వెళ్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి..

  • పెంపుడు జంతువులతో బయటకు వెళ్లే ముందు ఎటువంటి అవరోధం లేకుండా రిసార్ట్‌ను ముందుగానే బుక్ చేసుకోవాలి. పెంపుడు జంతువుతో హోటల్ లేదా రిసార్ట్‌కు వెళ్లడం చాలా కష్టమైన పని.
  • బయటకు వెళ్లేటప్పుడు పెంపుడు కుక్క మంచం కూడా మీతో తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి. బయటికి వెళ్లేటప్పుడు ఇంటి సౌకర్యాన్ని వాటికి కల్పించాలి. లేదంటే అవి ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటాయి.
  • మీ పెట్ డాగ్‌కు అవసరమైన వస్తువులను ముందుగానే ఓ బ్యాగ్‌లో సర్దిపెట్టుకోవాలి. మీరు బయటకు వెళ్లేటప్పుడు బ్యాక్‌ప్యాక్‌ను మీతోపాటు తీసుకెళ్లండి. బయట వాటికి అవసరమైన మందులు, ఆహారం, నీరు అందించడం సులువుగా ఉంటుంది.
  • వర్షం నడుస్తున్నప్పుడు మీ పెంపుడు కుక్క తడిసిపోకుండా చూసుకోవాలి. తడిగా ఉన్నా లేకున్నా మీతోపాటు డ్రైయర్‌ని తీసుకెళ్లండి. టవల్ తో తుడిచి డ్రైయర్ తో ఆరబెట్టాలి.
  • కుక్క శరీరంపై బురద పడితే, దానిని బాగా శుభ్రం చేయాలి. బురద కుక్క నోటిలోకి వస్తే, అది కడుపు సమస్యలను కలిగిస్తుంది.
  • పెంపుడు జంతువులను తుఫానుల సమయంలో బయటికి వదలక పోవడమే మంచిది. మీ పెట్‌ డాగ్‌ శరీరంతో పాటు దాని మనస్సుపై కూడా నిఘా ఉంచండం మరచిపోకూడదు.

మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్‌ చేయండి.