Srilakshmi C |
Updated on: Apr 18, 2022 | 7:25 AM
రోజువారీ ఆహారంలో టమోటాలు తినడం లేదా టమోటా రసం తాగడం వల్ల అధిక చెమట సమస్యను తగ్గించొచ్చు.
ప్రతీ రోజు ఒక కప్పు గ్రీన్ టీని తాగితే.. చెమటను నియంత్రించడంలో సహాయపడుతుంది.
చెమట నుంచి ఉపశమనం పొందడానికి బంగాళాదుంపలను ఉపయోగించవచ్చు. బంగాళాదుంప ముక్కలతో ఎక్కువగా చెమట పట్టే భాగంలో రుద్దడం వల్ల చెమటపట్టదు.
చెమట ఎక్కువగా పడితే ప్రతి రోజూ తలస్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందు నీళ్లలో రెండు చిటికెల బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ నీటితో స్నానం చేయాలి.
రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల చెమట దుర్వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు. డీహైడ్రేషన్ సమస్యను అధిగమించొచ్చు.