- Telugu News Photo Gallery IPL Completes 10 tousand sixes in 15 seasonsm Chris Gayle leads the race with 357 sixes in Telugu
IPL 2022: ఐపీఎల్‌లో 10,000 సిక్సర్ల పూర్తి.. అత్యధిక సిక్స్‌లు బాదిన రికార్డు ఆ స్టార్ ఆటగాడిదే..
IPL 2022: 2008 లో ప్రారంభమైన IPL విజయవంతంగా 15 వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈక్రమంలో ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.
Updated on: Apr 18, 2022 | 9:47 AM

2008 లో ప్రారంభమైన IPL విజయవంతంగా 15 వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈక్రమంలో ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.

ప్రస్తుత సీజన్ విషయానికొస్తే.. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 18 సిక్సర్లు బాదాడు. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు విషయానికొస్తే, ఇక్కడ కూడా క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2012లో 14 ఇన్నింగ్స్‌ల్లో 59 సిక్సర్లు బాది తన బ్యాట్ పవర్‌ను చూపించాడు.

रIPL 2022 సీజన్లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లు మొత్తం 7 సిక్సర్లు బాదారు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో టోర్నీలో మొత్తం 10 వేల సిక్సర్లు పూర్తయ్యాయి. కాగా ప్రస్తుత సీజన్‌లోనే 420కి పైగా సిక్సర్లు నమోదయ్యాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన IPL మొదటి సీజన్ నుంచి క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఎంతో మంది యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ లీగ్ ఒక వేదికగా నిలిచింది. అంతేకాదు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఎన్నో రికార్డులకు ఈ లీగ్ వేదికగా నిలిచింది. అలా ఐపీఎల్ 15వ సీజన్‌తో టోర్నీ చరిత్రలో 10 వేల సిక్సర్ల సంఖ్య కూడా పూర్తయింది.

Iplలో 10, 000 సిక్స్‌లు పూర్తయ్యాయి..

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉంది.ఈ యూనివర్సల్ బాస్ మొత్తం 141 ఇన్నింగ్స్ లో 357 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. అతని తర్వాత దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ 157 ఇన్నింగ్స్‌లలో 239 సిక్సర్లు బాదాడు.




