Surya Kala |
Updated on: Apr 17, 2022 | 9:14 PM
ఇలాంటి విషయాల్లో తప్పులు చేస్తే భార్యభర్తల మధ్య సంబంధం ఎక్కువ కాలం ఉండదని చాణక్య పేర్కొన్నారు.
చాణక్య నీతి ప్రకారం, జీవితంలో సంపద, శ్రేయస్సును కొనసాగించడానికి మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం చాలా ముఖ్యం. ఏ లక్ష్యం లేకుండా ముందుకు సాగడం జీవితంలో చాలా కష్టం.
చాణక్య నీతి ప్రకారం ఎల్లప్పుడూ డబ్బు ఆదా చేసుకోండి. అలా అదా చేయడంలో జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడవు. కనుక వృధా ఖర్చులు పెట్టకండి. అవసరాన్ని బట్టి డబ్బు ఖర్చు పెట్టండి.
అబద్ధాలు - ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. అబద్ధాలు ఏవైనా సంబంధాన్ని బలహీనపరుస్తాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అది బంధానికి హాని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య నిజాయితీ ఉండటం చాలా ముఖ్యం. ఇద్దరి బంధం సత్యం, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, గౌరవం, ఉద్యోగం, విద్య , తెలివైన వ్యక్తులు లేని ప్రదేశంలో నివసించకూడదు. అలాంటి చోట డబ్బు సంపాదించడం చాలా కష్టం. దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.