AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్సలు చేదు లేని కరకరలాడే కాకరకాయ వేపుడు.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే !!

కాకరకాయ అంటేనే చాలామంది చేదు అని ముఖం తిప్పేసుకుంటారు. కానీ, సరైన పద్ధతిలో వండితే ఆ చేదే అమృతంలా మారుతుంది! మన షెఫ్ స్టైల్‌లో నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి కారంతో నోరూరించేలా, అస్సలు చేదు లేకుండా కరకరలాడే కాకరకాయ వేపుడు ఎలా చేయాలో ఈ కథనంలో చూద్దాం. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగి మరీ చేయించుకుంటారు!

Phani CH
|

Updated on: May 15, 2026 | 4:45 PM

Share
సాధారణంగా ఇంట్లో కూరగాయల మార్కెట్ నుండి తెచ్చిన సంచిలో కాకరకాయలు కనిపిస్తే చాలు.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది నీరసపడిపోతారు. "అబ్బా! ఈరోజు కాకరకాయ కూరా? చేదుగా ఉంటుంది నేను తినను" అనే మాట ప్రతి ఇంటా వినిపించేదే. కానీ, కాకరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రక్త శుద్ధికి, మధుమేహం ఉన్నవారికి ఇది ఒక సంజీవని లాంటిది. మరి అంతటి గుణాలున్న ఈ కూరగాయను చేదు లేకుండా, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా కురుకుతూ తినేలా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే ఈ వేపుడు 10 నుండి 15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది.

1 / 5
కావాల్సిన పదార్థాలు: ఈ అద్భుతమైన వేపుడు కోసం ముందుగా అరకిలో తాజా కాకరకాయలను తీసుకోవాలి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి, పైన ఉండే బరుకైన బుడిపెలను చాకుతో లైట్‌గా గీరాలి. దీనివల్ల చేదు చాలావరకు తగ్గుతుంది. ఆ తర్వాత వాటిని మరీ లావుగా కాకుండా, అలాగని మరీ సన్నగా కాకుండా మీడియం సైజు గుండ్రటి చక్రాల్లా కట్ చేసుకోవాలి. లోపల ఉండే గింజలు నచ్చని వారు తీసేయవచ్చు, కానీ ఆ గింజలు కూడా వేగితే భలే రుచిగా ఉంటాయి.

2 / 5
క్రిస్పీగా వేయించుకోవడం: ముక్కలు సిద్ధమయ్యాక, స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె కాగాక, ఫ్లేమ్‌ను మీడియంలో ఉంచి కాకరకాయ ముక్కలను రెండు విడతలుగా వేసి వేయించుకోవాలి. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చి క్రిస్పీగా మారేంతవరకు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అదే నూనెలో అరకప్పు పల్లీలను, ఒక గుప్పెడు కరివేపాకును కూడా విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ప్రత్యేకమైన మసాలా కారం: ఈ వేపుడుకు అసలైన రుచిని ఇచ్చేది ఇందులోకి తయారుచేసే కారమే! స్టవ్ మీద మరో పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. చివర్లో పావు కప్పు నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించి చల్లార్చాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా వేయించిన పల్లీలను వేసి ఒక్కసారి పల్స్ ఇచ్చి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి కాకరకాయ ముక్కల్లో కలపాలి. ఆ తర్వాత అదే జార్‌లో నువ్వుల మిశ్రమం, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, మూడు చెంచాల కారం, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు వేసి బరకగా మిక్సీ పట్టి, చివర్లో 10-15 వెల్లుల్లి రెమ్మలు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.

4 / 5
ఈ విధంగా సిద్ధం చేసుకున్న ఘుమఘుమలాడే వెల్లుల్లి నువ్వుల కారాన్ని, వేయించిన కరివేపాకును కాకరకాయ ముక్కల్లో వేయాలి. చేత్తో కాస్త గట్టిగా నొక్కుతూ ముక్కలన్నింటికీ కారం పట్టేలా బాగా కలుపుకోవాలి. అంతే! ఎంతో రుచికరమైన, అస్సలు చేదు లేని కాకరకాయ వేపుడు సిద్ధం. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వేపుడుతో తింటే అమృతంలా ఉంటుంది. దీనిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే రెండు వారాల పాటు హ్యాపీగా ఆస్వాదించవచ్చు.

5 / 5
Follow Us