May 15, 2026
Subhash
వర్షాకాలంలో తేమ కారణంగా పచ్చళ్లు త్వరగా పాడవుతాయి. అయితే కొన్ని చిన్న కిచెన్ హాక్స్ ద్వారా వాటిని తాజాగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పచ్చడి జాడీలో లేదా సీసాలో నూనె ఎల్లప్పుడూ పచ్చడి కంటే కనీసం ఒక వేలు ఎత్తులో పైకి తేలుతూ ఉండాలి. దీనివల్ల బూజు పట్టదు. పచ్చళ్లకు నువ్వుల నూనె వాడటం మరీ మంచిది.
తడి చెంచా అస్సలు పెట్టకండి. పచ్చడి తీయడానికి తడి చెంచా వాడితే అది త్వరగా పాడైపోతుంది. పూర్తి పొడిగా ఉన్న స్టీల్ లేదా చెక్క చెంచాలను మాత్రమే ఉపయోగించండి.
పచ్చళ్లలో ఉప్పు, వెనిగర్ సహజ నిల్వ కారకాలుగా పనిచేస్తాయి. వీటి మోతాదు కరెక్ట్‌గా ఉంటే బ్యాక్టీరియా, బూజు (Fungus) పచ్చడి దరిచేరవు. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పచ్చడి తీసిన తర్వాత సీసా లేదా జాడీ లోపలి అంచులకు అంటుకున్న పచ్చడి ముక్కలను పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి. ఎందుకంటే బూజు మొదట అక్కడే పడుతుంది.
పచ్చళ్లను నిల్వ చేయడానికి పింగాణీ జాడీలు లేదా గాజు సీసాలు మాత్రమే ఉత్తమమైనవి. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం అంత మంచిది కాదని గుర్తించుకోండి.
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకే పచ్చడి సీసా మూత ఎయిర్‌టైట్‌గా (గాలి చొరబడకుండా) ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోండి.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు పెట్టిన నిల్వ పచ్చడి తాజాగా, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. పైగా బూజు పట్టకుండా ఉంటుంది.