సానుకూల ఆలోచనలు..ప్రతి రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి. “ఈ రోజు మంచి జరుగుతుంది” అనే నమ్మకంతో ముందుకు సాగండి. ఇలా చేస్తే మనసు ఉత్సాహంగా ఉంటుంది.
ప్రతికూల ఆలోచనలను నియంత్రించండి..మనసులో వచ్చే నెగటివ్ ఆలోచనలను గుర్తించి, అవి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోండి. వాటిని సహజంగా తగ్గించే ప్రయత్నం చేయండి.
కృతజ్ఞత భావం.. మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న సంతోషాలకూ కృతజ్ఞత చెప్పండి. ఇది మనసుకు శాంతిని, సంతృప్తిని ఇస్తుంది.
సానుకూల వ్యక్తులతో ఉండండి..మీకు ప్రోత్సాహం ఇచ్చే, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తులతో సమయం గడపండి. వారి ప్రభావం మీలో కూడా పాజిటివిటీని పెంచుతుంది.
వ్యాయామం చేయండి... ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ధ్యానం, ప్రాణాయామం.. ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గి, నెగటివ్ ఆలోచనలు కూడా తగ్గుతాయి.
సోషల్ మీడియా వినియోగం.. అధికంగా సోషల్ మీడియాలో గడపడం వల్ల ఒత్తిడి, ప్రతికూల భావనలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయాన్ని నియంత్రించండి.
మీకు నచ్చిన పనులు చేయండి.. రోజులో కొంత సమయం మీ ఇష్టమైన పనులకు కేటాయించండి. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం లేదా హాస్య వీడియోలు చూడడం మంచి మార్గాలు.
లక్ష్యాలను రాసుకోండి.. మీ లక్ష్యాలను స్పష్టంగా రాసుకుని, వాటిని సాధించడానికి ప్రణాళిక వేసుకోండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, దిశను ఇస్తుంది.