కెమికల్ మామిడి పండ్లను గుర్తించడం ఎలా..? ఇవి పాటిస్తే మీ హెల్త్ సేఫ్
Krishna
15 May 2026
సహజంగా పండిన మామిడి పండు ఒకే రంగులో ఉండదు. అక్కడక్కడ ఆకుపచ్చ, పసుపు, నారింజ మచ్చలు ఉంటాయి. కానీ రసాయనాలతో పండించిన పండ్లు ఒకే రకమైన పసుపు లేదా బంగారు రంగులో మెరిసిపోతుంటాయి.
రంగును బట్టి
మామిడి పండును కాడ దగ్గర వాసన చూస్తే.. సహజంగా పండిన పండు నుంచి అద్భుతమైన తియ్యటి సువాసన వస్తుంది. రసాయనాలతో పండించిన పండ్లకు అసలు వాసన ఉండదు, లేదా ఒక రకమైన ఘాటైన కెమికల్ వాసన వస్తుంది.
కాడ దగ్గర వాసన
మీరు కొన్న పండ్లను ఒక బకెట్ నీటిలో వేయండి. సహజంగా పండిన మామిడి పండ్లు నీటిలో మునిగిపోతాయి. రసాయనాలతో పండించిన పండ్లు నీటిపై తేలుతాయి. ఇది అన్నిటికంటే సులభమైన, ఖచ్చితమైన పరీక్ష.
నీటి పరీక్ష
సహజంగా పండిన పండును మెల్లగా నొక్కితే మెత్తగా అనిపిస్తుంది. అదే కృత్రిమంగా పండించిన పండు అయితే పైన మెత్తగా ఉన్నా, లోపల మాత్రం గట్టిగా ఉంటుంది. కొన్నిసార్లు అసాధారణంగా గుజ్జులా మారిపోయి ఉంటుంది.
నొక్కి చూస్తే
పండును కోసినప్పుడు లోపల గుజ్జు అంతా ఏకరీతి రంగులో, రసవంతంగా ఉంటే అది మంచి పండు. రసాయనాలు వాడితే పండు లోపల అక్కడక్కడ తెల్లగా లేదా లేత పసుపు రంగులో గట్టిగా ఉంటుంది.
కోసి చూడండి
మామిడి పండుపై చిన్న చిన్న నల్లటి మచ్చలు ఉంటే అది సహజంగా పండిందని అర్థం. పెద్ద పెద్ద నల్లటి ప్యాచెస్ లేదా విపరీతమైన ముడతలు ఉంటే మాత్రం అది కెమికల్ ట్రీట్మెంట్ వల్ల వచ్చినవి అని గుర్తుంచుకోవాలి.
నల్లటి మచ్చలు
చూడగానే కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయంటే, వాటిపై మైనం లేదా ఇతర రసాయన పూతలు పూసి ఉండవచ్చు. కాబట్టి పాలిష్ చేసిన వాటి కంటే సహజంగా, కాస్త మామూలుగా కనిపించే పండ్లనే ఎంచుకోండి.
మెరిసే పండ్లు
వీలైనంత వరకు రైతు బజార్లు, సేంద్రీయ స్టోర్లు లేదా మీకు తెలిసిన తోటల దగ్గర పండ్లను కొనుగోలు చేయడం సురక్షితం. స్థానికంగా లభించే కాలానుగుణ మామిడి పండ్లే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.