- Telugu News Photo Gallery How to maintain your AC efficiency this monsoon, what happens if an air conditioner is not used in rainy season
AC Care: వర్షాకాలంలో ఏసీ వాడకపోతే పాడైపోతుందా..? ఎక్కువ రోజులు ఆఫ్ చేసి ఉంచితే ఏమవుతుంది..
ఎండాకాలంలో చాలామంది వేలాది రూపాయలు ఖర్చు ఏసీ (ఎయిర్ కండీషనర్) లను కొనుగోలుచేసి ఉపశమనం పొందారు.. అయితే.. వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది.. ఇప్పుడు ఇళ్లల్లోని ఏసీలన్నీ బంద్ అయ్యాయి.. బయట వాతావరణం చల్లగా ఉండటంతో ఎవరూ కూడా ఏసీలను ఉపయోగించడం లేదు..
Updated on: Jul 20, 2024 | 3:47 PM

ఈ వేసవిలో ఎండలు దంచికొట్టాయి.. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దాదాపు 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. దీంతో చాలామంది తీవ్ర ఉక్కపోత.. ఎండ వేడితో అల్లాడిపోయారు.. ఈ క్రమంలోనే.. చాలామంది ఏసీ (ఎయిర్ కండీషనర్) లను కొనుగోలుచేసి ఉపశమనం పొందారు.. అయితే.. వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది.. ఇప్పుడు ఇళ్లల్లోని ఏసీలన్నీ బంద్ అయ్యాయి.. బయట వాతావరణం చల్లగా ఉండటంతో ఎవరూ కూడా ఏసీలను ఉపయోగించడం లేదు.. అయితే.. ఈ రెయినీ సీజన్‌లో ఏసీ ఉన్న ప్రతీ ఒక్కరికి తలెత్తే ప్రశ్న ఏమిటంటే.. వర్షాకాలంలో ఏసీ వాడకపోతే పాడైపోతుందా? ఇలా ఎంతకాలానికి ఏసీ రిపేర్ కు వస్తుంది.. ఎయిర్ కండిషనింగ్ (AC)ని ఆఫ్ చేయడం అవసరమా..? బాహ్య AC యూనిట్ కెపాసిటర్ కు ఏమన్నా అవుతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతాయి..

వాస్తవానికి ఏసీ ఎక్కువగా ఉపయోగించకపోయినా, మరమ్మతుల కోసం వస్తూనే ఉంటుంది. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది కాబట్టి. దీన్ని నివారించడానికి ఇక్కడ కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో చూడండి..

చలి కారణంగా వర్షాకాలంలో ఏసీని ఎక్కువగా ఉపయోగించరు.. దీంతోపాటు.. వాతావరణాన్ని వేడి చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగించరు. పూర్తిగా బంద్ చేసి ఉంచుతారు.. అయితే.. ఇంట్లో AC ఉన్నప్పుడు రెగ్యులర్ సర్వీసింగ్, గ్యాస్ స్థాయిని తనిఖీ చేయడం చేయడం ముఖ్యం.

వాస్తవానికి వర్షాకాలంలో ఏసీని ఉపయోగించపోయినా ఏం కాదు.. కానీ.. మీరు దీన్ని చాలా కాలం పాటు ఉపయోగించకపోతే.. AC యూనిట్ స్తంభించిపోయి.. తుప్పు పట్టే అవకాశం ఉంది.. ఇది కంప్రెసర్ వైఫల్యం లేదా రిఫ్రిజెరాంట్ లీకేజీ, అలాగే ఇతర భాగాలకు నష్టం వంటి మరింత ఖరీదైన సమస్యలకు దారితీయవచ్చు.

AC నుంచి గ్యాస్ లీకేజ్ అనేది ఒక ప్రధాన సమస్య.. దీని కారణంగా AC త్వరగా చెడిపోతుంది. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఇంకా ఏసీలో గ్యాస్ లీకేజీ లేకుండా చూసుకుంటే మంచిది.

భారీ వర్షాలు మీ AC యూనిట్‌ను పాడు చేయలేవు.. అదే వర్షంతో కూడిన గాలుల వల్ల ధూళి, చెత్త చేరి కండెన్సర్ ఫ్యాన్ గ్రిల్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.. మీ యూనిట్‌పై ఎలాంటి వస్తువులు పడకుండా చూసుకోండి.. ఇంకా వర్షం పడినప్పటికీ.. అవుట్‌డోర్ ఏసీ యూనిట్‌కు ఏం కాదు.. దానిని కప్పి ఉంచాల్సిన అవసరంలేదు. సరిగ్గా పనిచేసే AC సామర్థ్యాన్ని వర్షం ప్రభావితం చేయదని గుర్తుంచుకోవాలి..




