- Telugu News Photo Gallery How to clean a burnt vessels? follow these tips, check here is details in Telugu
Burnt Vessels Clean: గిన్నెలు బాగా మాడిపోయాయా.. డోంట్ వర్రీ.. వీటితో క్లీన్ చేస్తే సరి!
వంటలు చేసేటప్పుడు పాత్రలు మాడిపోవడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇలా మాడిన గిన్నెలు ఒక పట్టాన వదలవు. వీటిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రావాలంటే నానా తంటాలు పడతారు లేడీస్. మరి ఇలా మాడిన పాత్రలు ఈజీగా తక్కువ సమయంలోనే క్లీన్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. గిన్నెలు మాడిపోయిన వెంటనే అందులో వేడి నీరు పోయండి. నెక్ట్స్ అందులో కొద్దిగా డిటెర్జెంట్ పౌడర్ వేసి ఓ పది నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత క్లీన్ చేస్తే..
Updated on: Mar 23, 2024 | 5:45 PM

వంటలు చేసేటప్పుడు పాత్రలు మాడిపోవడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇలా మాడిన గిన్నెలు ఒక పట్టాన వదలవు. వీటిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రావాలంటే నానా తంటాలు పడతారు లేడీస్. మరి ఇలా మాడిన పాత్రలు ఈజీగా తక్కువ సమయంలోనే క్లీన్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

గిన్నెలు మాడిపోయిన వెంటనే అందులో వేడి నీరు పోయండి. నెక్ట్స్ అందులో కొద్దిగా డిటెర్జెంట్ పౌడర్ వేసి ఓ పది నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత క్లీన్ చేస్తే మరకలు పోతాయి. చెడు వాసన కూడా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి.

అదే విధంగా మీరు తాగే కూల్ డ్రింక్స్ కూడా మాడిన మరకలను ఈజీగా వదిలించేస్తుంది. మాడిపోయిన పాత్రల మీద థమ్స్ అప్, స్ప్రైట్ వంటివి వేసి కాసేపు పక్కన ఉంచండి. ఆ తర్వాత స్క్రబర్‌తో శుభ్రం చేస్తే.. తెల్లగా మెరుస్తాయి.

నిమ్మకాయ కూడా గిన్నెలపై మాడిన మరకలను వదిలించడం చక్కగా పని చేస్తుంది. నిమ్మ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి.. మాడిన మరకలపై వేయండి. ఓ ఐదు నిమిషాలు అలా వదిలేసి.. స్క్రబర్‌తో క్లీన్ చేస్తే సరి.

అదేవిధంగా వంటగదిలో ఉండే అద్భుతమైన వస్తువుల్లో వాటిల్లో బేకింగ్ సోడా ఒకటి. మాడిన గిన్నెల్ని క్లీన్ చేయడంలో బేకింగ్ సోడా బాగా ఉపయోగ పడుతుంది. బేకింగ్ సోడాలో నీటిని కలిపి.. మాడిన గిన్నెలపై వేసి కాసేపు వదిలేసి.. తర్వాత క్లీన్ చేస్తే తెల్లగా మారతాయి.




