- Telugu News Photo Gallery How many eggs does a hen lay in a year in poultry farm interesting facts here for you
Eggs Farming: కోడి సంవత్సరానికి ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా? ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..
Eggs: హెల్తీ ఫుడ్‌లలో కోడిగుడ్డుకు ఉండే ప్రత్యేకతే వేరు. ప్రంపచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎక్కువగా కోడిగుడ్డును రోజువారీగా తింటారు. అయితే, ఇంతమంది జనాలకు అన్ని కోడిగుడ్లు ఎలా వస్తున్నాయి? ఒక కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది? ఇంట్రిస్టింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 04, 2021 | 10:15 PM

ప్రపంచ వ్యాప్తంగా జనాలు కోడి గుడ్లను ఎక్కువగా తింటారు. కోడితో పాటు బాతులు, ఇతర పక్షుల గుడ్లను కూడా తింటారు. అయితే మార్కెట్‌లో వాటి లభ్యత అంతగా ఉండదు.

గుడ్డును అనేక రకాలుగా తినొచ్చు. పచ్చి గుడ్డు, ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లేట్, కోడిగుడ్డు కూర, ఇలా కోడిగుడ్డును అనేక రకాలుగా తింటారు. నాన్ వెజ్ ఆహారం తినని వారు సైతం కోడిగుడ్లను తింటారు.

ప్రపంచ వ్యాప్తంగా గుడ్డు ప్రియులు ఇంతమంది ఉంటే.. వీరందరికీ గుడ్లు ఎలా సరిపోతున్నాయి. ఒక కోడి అసలు ఎన్ని గుడ్లు పెడుతుంది? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఆ థాట్ వచ్చినా సమాధానం దొరకలేదా? అయితే ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం..

పౌల్ట్రీ సైంటిస్ట్ డాక్టర్ ఏయూ కిద్వాయ్ ప్రకారం.. కోళ్లు పౌల్ట్రీలో సంవత్సరానికి 305 నుండి 310 గుడ్లు పెడతాయి. అంటే, ఒక కోడి ఒక నెలలో సగటున 25 నుండి 26 గుడ్లు పెడుతుంది. అయితే, ఈ సంఖ్య స్థిరంగా ఉండకపోవచ్చు. సంవత్సరానికి పెట్టే గుడ్ల సంఖ్య కొద్దిగా మారవచ్చు. ఇక దేశవాళీ కోళ్ల గురించి చెప్పుకుంటే.. అవి సంవత్సరానికి 150 200 గుడ్లు మాత్రమే పెడుతాయి.

కోళ్లు గుడ్లు పెట్టే సామర్థ్యం కూడా పౌల్ట్రీ ఫామ్‌ను నడుపుతున్న వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని యూపీ పౌల్ట్రీ ఫామ్ అసోసియేషన్ అధ్యక్షుడు నవాబ్ అలీ అక్బర్ అంటున్నారు. కోళ్ల సంరక్షణ, ఆరోగ్యం కూడా గుడ్లు పెట్టడంపై ప్రభావం చూపుతాయట. నవాల్ అలీ ప్రకారం.. పౌల్ట్రీ ఫామ్‌లోని కోడి ఒక సంవత్సరంలో 300 నుండి 330 గుడ్లు పెడుతుంది.

ఒక కోడి 75 నుండి 80 వారాల వరకు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని జాతుల కోళ్లు 100 వారాల వరకు కూడా గుడ్లు పెడతాయి. అయితే పౌల్ట్రీ ఫారం వ్యాపారం చేసే వారికి రెండు ఆదాయ వనరులు ఉన్నాయి. ఒకటి, గుడ్ల వ్యాపారం, రెండవది కోడి/మాంసం కోసం కోళ్ల వ్యాపారం కూడా చేస్తారు.




