- Telugu News Photo Gallery Science photos Senior Citizens Health Know The Reasons to why total rest is not good for health
Senior Citizens Health: పదవీ విరమణ తర్వాత ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త..!
ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, పదవీ విరమణ వయస్సులో ప్రజలు పని చేయడం మానేసి హాయిగా జీవితాన్ని గడపాలని ప్లాన్ వేసుకుంటున్నారు. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాలని చూస్తారు.
Updated on: Nov 04, 2021 | 10:14 PM

Senior Citizens Health: ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, పదవీ విరమణ వయస్సులో ప్రజలు పని చేయడం మానేసి హాయిగా జీవితాన్ని గడపాలని ప్లాన్ వేసుకుంటున్నారు. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాలని చూస్తారు. అయితే, వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవడంతో పాటు.. చురుకుగా ఉండటం కూడా చాలా ముఖ్యం. అంటే విశ్రాంతితో పాటు.. ఆరోగ్యంగా కూడా ఉండటం ముఖ్యం కావున.. కాస్త శారీరక శ్రమ కూడా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం ఎందుకు తప్పు? నేషనల్ స్లీప్ ఫెడరేషన్ ప్రకారం.. 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి 8 9 గంటల నిద్ర సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువగా నిద్రపోయినట్లయితే.. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందట. మెదడు సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయట. ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే నిద్ర సంబధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

యాక్టివ్‌గా ఉండాలంటే: సీనియర్ సిటిజన్స్ నిపుణుడు డాక్టర్ రిషబ్ బన్సల్ దీనిపై మట్లాడుతూ.. సీనియర్ సిటిజన్‌లు తమను తాము చురుకుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శారీరక శ్రమ మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని చెప్పారు.

ఇది కాకుండా, సీనియర్ సిటిజన్లు శారీరక శ్రమ చేస్తే.. కండరాల సమస్యల నుండి దూరంగా ఉంటారు.

పదవీ విరమణ వయసు, వృద్ధా్ప్య వయసులో కాస్త వ్యాయామం వంటివి చేయడం ద్వారా చురుకుగా ఉండటం, జ్ఞాపకశక్తి బలంగా ఉండటంతో సహాయపడుతుంది.





























