- Telugu News Photo Gallery Homemade Hair Mask: Try This Aloe Vera And Flaxseed Hair Mask For Soft And Shiny hair In Winter
Homemade Hair Mask: వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారుతోందా? ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి
చలిలో వేడి నీళ్ళు లేకుండా స్నానం చేయడం దాదాపు అసాధ్యం. అయితే ఈ చలికాలంలో వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారుతుంది. వేడినీటి స్నానం జుట్టుకు సరిపడదు. వేడినీరు జుట్టులోని తేమను తొలగిస్తుంది. ఇది జుట్టును డల్‌గా, రఫ్ గా మార్చుతుంది. స్కాల్ప్ కూడా డ్రైగా మారి చుండ్రు సమస్య పెరుగుతుంది. అయితే చలికాలంలో వేడినీరు లేకుండా స్నానం చేయడం కష్టం.. మరెలా అనుకుంటున్నారా? ఈ సహజ పదార్ధాలతో జుట్టు వాల్యూమ్ను సులభంగా పెంచడం సాధ్యమవుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు..
Updated on: Jan 30, 2024 | 12:19 PM

చలిలో వేడి నీళ్ళు లేకుండా స్నానం చేయడం దాదాపు అసాధ్యం. అయితే ఈ చలికాలంలో వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారుతుంది. వేడినీటి స్నానం జుట్టుకు సరిపడదు. వేడినీరు జుట్టులోని తేమను తొలగిస్తుంది. ఇది జుట్టును డల్‌గా, రఫ్ గా మార్చుతుంది. స్కాల్ప్ కూడా డ్రైగా మారి చుండ్రు సమస్య పెరుగుతుంది. అయితే చలికాలంలో వేడినీరు లేకుండా స్నానం చేయడం కష్టం.. మరెలా అనుకుంటున్నారా? ఈ సహజ పదార్ధాలతో జుట్టు వాల్యూమ్ను సులభంగా పెంచడం సాధ్యమవుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.

ఖరీదైన షాంపూ, కండీషనర్ బ్రాండ్‌లను వాడకపోయినా జుట్టు మెరుపును కాపాడుకోవచ్చు. కలబంద, అవిసె గింజలు తక్షణం మీ జుట్టుకు తేమను పునరుద్ధరించగలవు. జుట్టు తేమను కాపాడుకోవడానికి చాలా మంది హెయిర్ మాస్క్‌లు లేదా హెయిర్ స్ప్రేల సహాయం తీసుకుంటారు. కానీ కలబంద, ఫ్లాక్స్ సీడ్స్‌తో తయారు చేసిన హెయిర్ మాస్క్ ఎటువంటి ఖర్చు లేదా దుష్ప్రభావాలు లేకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఫ్లాక్స్ సీడ్ జుట్టును హైడ్రేట్ చేయడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇవి జుట్టుకు బలాన్ని చేకూర్చడంలో సహాయపడతాయి. జుట్టు రాలడం, జుట్టు చివర్లు చిట్లడాన్ని నివారిస్తుంది. అలాగే చుండ్రును తగ్గించి, స్కాల్ప్ ను తేమగా ఉంచుతుంది. అలోవెరా జెల్ కూడా స్కాల్ప్‌ను తేమ ఉంచి, పొడి చుండ్రును నివారిస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కాల్ప్ దురదను తగ్గిస్తాయి. అలోవెరా జెల్ జుట్టుపై సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలంటే..

1 కప్పు నీటిలో 1 చెంచా ఫ్లాక్స్ సీడ్స్ వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ జెల్‌ను వడకట్టాలలి. ఈ జెల్‌లో 2-3 స్పూన్ల తాజా అలోవెరా జెల్, 2-3 చుక్కల కొబ్బరి నూనె కలుపుకోవాలి. అంతే హెయిర్ మాస్క్ రెడీ అయినట్లే.

ముందుగా జుట్టును బాగా దువ్వుకుని.. తర్వాత ఫ్లాక్స్ సీడ్, అలోవెరా జెల్‌తో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ను అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీళ్లతో తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.




