- Telugu News Photo Gallery Home Loan: This document is very important while one buys second hand flat or house
Home Loan: సెకండ్ హ్యాండ్ ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు అవసరమైన పత్రాలు ఏమిటి?
ఇల్లు కొనాలని చాలా మంది కలలు కంటారు. బ్యాంకు నుంచి రుణం తీసుకునే సమయంలో అన్ని రకాల పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చాలా పత్రాలు అవసరమై ఉంటాయి..
Updated on: Jul 07, 2023 | 7:54 PM

ఇల్లు కొనాలని చాలా మంది కలలు కంటారు. బ్యాంకు నుంచి రుణం తీసుకునే సమయంలో అన్ని రకాల పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చాలా పత్రాలు అవసరమై ఉంటాయి.

మీకు ఏ పత్రాలు అవసరమో ముందుగానే తెలియకపోతే మీరు ఆ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఒక యజమాని నుంచి ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు బ్యాంకు కొన్ని పత్రాలను అడుగుతుంది.

చాలా బ్యాంకులు రుణం తీసుకునేటప్పుడు అలాట్‌మెంట్ లెటర్‌ని అడుగుతాయి. ఇంట్లో లేదా ఫ్లాట్‌లో ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకోవడానికి బ్యాంక్ లీగల్ వెరిఫికేషన్ చేయవచ్చు.

అయితే ఆ అలాట్‌మెంట్ లెటర్ పోతే ఎలా ఉంటుందనేది ప్రశ్న. చాలా బ్యాంకులు ఈ పత్రం లేకుండా రుణాలు ఇస్తాయి. చాలా బ్యాంకుల విషయంలో ఆ పత్రం తప్పనిసరి. ప్రతి బ్యాంకుకు దాని స్వంత నియమాలు ఉన్నాయి. అలాట్‌మెంట్ లెటర్ పోయినట్లయితే, ఆ లేఖ ధృవీకరించబడిన నిజమైన కాపీని అందించాలని చాలా బ్యాంకులు అడుగుతుంటాయి. ఆ కాపీని సేకరించేందుకు బ్యాంకుకు E-FIR ఇవ్వాలి.

లేటర్ లేకపోతే బ్యాంకును త్వరగా సంప్రదించాలి. బ్యాంకు చెప్పిన దాని ప్రకారం పత్రాలు సేకరించాలి. ఎవరైనా ఇల్లు లేదా ఫ్లాట్‌లో 12 సంవత్సరాలు నివసిస్తుంటే, అతని యాజమాన్యంపై బ్యాంకుకు నమ్మకం పెరుగుతుంది. ఇలా అన్ని రకాల పత్రాలు ఇవ్వడం ద్వారా బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశాలు ఉంటాయి.




