- Telugu News Photo Gallery High Blood Pressure: These special Herbs And Spices That May Reduce Blood Pressure Levels Naturally
High Blood Pressure: చీటికి మాటికి కోపం వస్తుందా? అయితే మీ అలవాట్లలో ఈ మార్పులు చేసుకోవాల్సిందే
చీటికి మాటికి కోపం వస్తుందా? అయితే మీకు రక్తపోటు పెరుగుతున్నట్లే. అధిక రక్తపోటు సమస్య ఉంటే తలనొప్పి కూడా వేధిస్తుంది. అయితే హైపర్‌టెన్షన్ ఒకరోజు మందులు వాడినంత మాత్రాన పూర్తిగా నివారణ లభించదు. సుదీర్ఘకాలం అందుకు మందులు వాడవల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి..
Updated on: May 29, 2024 | 9:17 PM

చీటికి మాటికి కోపం వస్తుందా? అయితే మీకు రక్తపోటు పెరుగుతున్నట్లే. అధిక రక్తపోటు సమస్య ఉంటే తలనొప్పి కూడా వేధిస్తుంది. అయితే హైపర్‌టెన్షన్ ఒకరోజు మందులు వాడినంత మాత్రాన పూర్తిగా నివారణ లభించదు. సుదీర్ఘకాలం అందుకు మందులు వాడవల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ కింది సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉపయోగపడతాయి.

అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినవచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లిని వంటలో ఉపయోగించడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చు.

వెల్లుల్లితో పాటు అల్లం కూడా రక్తపోటు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అల్లం టీ, అల్లం రసం లేదా అల్లంతో తయారు చేసిన ఏదైనా పానీయం, అలాగే అల్లం వేసి వండిన కూరలు ఆహారంలో తీసుకున్నా ప్రయోజనాలు పొందవచ్చు.

అలాగే పసుపు కూడా షుగర్ నుంచి బ్లడ్ ప్రెజర్ వరకు, క్యాన్సర్ నుంచి ఆర్థరైటిస్ వరకు అన్ని సమస్యలను దూరం చేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ రక్తపోటును తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దాల్చిన చెక్క కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అలాగే రక్తపోటు సమస్యలను అదుపులో ఉంచుతుంది.

యాలకులు ఆహారాన్ని సువాసన కోసం ఉపయోగిస్తారు. ఈ మసాలాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి ఆహారంలో యాలకులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. రోజూ 8-10 తులసి ఆకులు తిన్నా రక్తపోటు తగ్గుతుంది. ఇవి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తులసి ఆకులతో టీ కూడా తయారు చేసుకోవచ్చు.




