- Telugu News Photo Gallery Herbal Tea for Health: 5 Herbal Tea Types To Sip On For Better Digestion And Immunity
Herbal Tea for Health: టీ, కాఫీలకు బదులుగా.. ఈ 5 రకాల హెర్బల్ టీలు తాగారంటే అజీర్ణ సమస్య పరార్!
ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట సమస్య పెరుగుతుంది. వీటిని వీలైనంత తక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అయితే టీ, కాఫీలకు దూరంగా ఉండటం కాస్త ఇబ్బందే. జీర్ణ రుగ్మతలను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. తినడం, తాగడం దగ్గర్నుంచి వ్యాయామం వరకు అన్నింటిపైనా ఓ కన్నేసి ఉంచాలి. అప్పుడే జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలను నివారించడానికి టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు..
Updated on: Feb 06, 2024 | 7:48 PM

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట సమస్య పెరుగుతుంది. వీటిని వీలైనంత తక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అయితే టీ, కాఫీలకు దూరంగా ఉండటం కాస్త ఇబ్బందే.

జీర్ణ రుగ్మతలను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. తినడం, తాగడం దగ్గర్నుంచి వ్యాయామం వరకు అన్నింటిపైనా ఓ కన్నేసి ఉంచాలి. అప్పుడే జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలను నివారించడానికి టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. బదులుగా జీర్ణ సమస్యలను తగ్గించే ఈ కింది 5 రకాల టీలు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అజీర్తిని నివారించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

తులసి, అశ్వగంధ టీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి వల్ల వచ్చే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అల్లం, పుదీనా ఆకులను వేడి నీటిలో మరిగించి తాగాలి. ఈ పానీయం గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం తొలగిస్తుంది. ఈ టీలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పచ్చి పసుపు, మిరియాలు, అల్లం వేడి నీటిలో మరిగించి తయారు చేసిన టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. టర్మరిక్ టీ కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రుచి కోసం దీనిలో కొంచెం తేనె కలపవచ్చు.

అల్లం, లెమన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ టీలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరోవైపు అల్లం జీర్ణ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. అల్లం - లెమన్ టీ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగు అల్లం, ముల్లేతి టీ కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ టీ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం అందించడమే కాకుండా, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే అల్లం, ముల్లేటి టీ తాగవచ్చు. ఈ టీ వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.




